Bedurulanka 2012 Trailer: మూఢ నమ్మకాలు వాటిని ప్రచారం చేసే టీవీ ఛానల్స్. పిరికి జనాలను మరింత భయపెట్టేస్తాయి. అలాంటి ఓ పాయింట్ తీసుకుని అల్లుకున్న కథ బెదురులంక. గోదావరి పాయ మధ్యలో ఉన్న ఒక చిన్న ఊరికి మిగతా ప్రపంచంతో పెద్దగా సంబంధాలు ఉండవు. మంచి, చెడు వాళ్ళ మధ్యే. చిన్న అపవాదు క్షణాల్లో ఊరికి పాకేస్తుంది. 2012 డిసెంబర్ 21న యుగాంతం వచ్చేస్తుందని గట్టిగా ప్రచారం జరిగింది. ఈ విషయాన్ని టీవీ ఛానల్స్ రెండు రోజుల ముందు నుండే నాన్ స్టాప్ గా ప్రసారం చేశాయి.
యుగాంతం వార్తను చాలా సీరియస్ గా తీసుకున్న బెదురులంక ప్రజలు ఎలాంటి ఆందోళకు గురయ్యారు. దీని వలన బెదురులంక గ్రామంలో ఏర్పడిన పరిస్థితులు ఏంటనేది ఈ చిత్రం. మూడు మతాల అధిపతులు దీన్ని తమ స్వార్ధానికి వాడుకోవాలని ప్రయత్నం చేస్తే ఏం జరిగింది. ఈ కథలో హీరో కార్తికేయ, హీరోయిన్ నేహా శెట్టి పాత్ర ఏంటనేది సినిమాలో చూడాలి.
మొత్తంగా బెదురులంక ట్రైలర్ ఆకట్టుకుంది. సస్పెన్సు, హారర్, కామెడీ, రొమాన్స్ అన్నీ కలగలిపి బెదురులంక చిత్రాన్ని దర్శకుడు తెరకెక్కించాడు. కార్తికేయ లుక్, మేనరిజం ఆకట్టుకున్నాయి. నేహా శెట్టి గ్లామర్ ట్రీట్ బాగానే ఉంది. హీరో కార్తికేయ చిరంజీవి అసలు పేరు శివ శంకర్ వరప్రసాద్ ని వాడుకోవడం విశేషం. ట్రైలర్ చివర్లో ‘శివ శంకర్ వర ప్రసాద్ టైం బిగిన్స్’ అని చెప్పాడు.
బెదురులంక చిత్రానికి క్లాక్స్ దర్శకుడు. మణిశర్మ సంగీతం అందించారు. ఆగస్టు 25న విడుదల కానుంది. రవీంద్ర బెనర్జీ ముప్పనేని తెరకెక్కించారు. అజయ్ ఘోష్, సత్య, రాజ్ కుమార్, శ్రీకాంత్ అయ్యర్, ఆటో రామ్ ప్రసాద్ నటించారు. ఇక ఆర్ఎక్స్ 100 తర్వాత కార్తికేయకు హిట్ లేదు. ఈ క్రమంలో విలన్ గా కూడా నటించాడు. బెదురులంకతో కమ్ బ్యాక్ అవుతాడేమో చూడాలి.