Bedurulanka 2012 OTT: థియేటర్ల కంటే ఓటీటీలకే ఆదరణ ఎక్కువగా అవుతుంది. ఇలాంటి సందర్బాలలో నిర్మాతలు కూడా వెరైటీ నిర్ణయాలే తీసుకుంటున్నారు. కొన్ని సినిమాలు ఎప్పుడు? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతాయనే విషయాన్ని ముందే చెప్పినా.. కొన్ని సినిమాలు మాత్రం సైలెంట్ గా వచ్చేస్తున్నాయి. ఎలాంటి సందడి లేకుండా వచ్చే ఈ సినిమాలను చూసి అభిమానులు కూడా షాక్ అవుతున్నారు.ఇదే విధంగా వచ్చింది హీరో కార్తికేయ నటించిన బెదురులంక-2012 మూవీ. 2012 యుగాంతం నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం.. ప్రేక్షకుల నుంచి మిక్స్ డ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈ మూవీలో డీజే టిల్లు ఫేమ్ నేహా శెట్టి హీరోయిన్ గా నటించింది. ఈ మూవీలో ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
ఆర్ఎక్స్ 100 తో ఫుల్ ఫేమస్ అయినా కార్తికేయ నటించిన చిత్రం ‘బెదురులంక-2012’. ఈ చిత్రానికి క్లాక్స్ దర్శకత్వం వహించగా.. కార్తికేయకు జోడీగా నేహా శెట్టి నటించింది. అయితే ఈ మూవీ ఓటీటీలోకి సడెన్ గా వచ్చింది. ఈ రోజునుంచే ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయిన ప్రేక్షకులు ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా? అని ఎదురుచూశారు. ఈ క్రమంలోనే వారి ఎదురుచూపులకు తెరదించుతూ.. సైలెంట్ గా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రంలో అజయ్ ఘోష్, రాజ్ కుమార్ కసిరెడ్డి, శ్రీకాంత్ అయ్యంగార్, ఎల్బీ శ్రీరామ్, సత్య తదితరులు ముఖ్యపాత్రలు పోషించగా.. మణిశర్మ సంగీతాన్ని సమాకూర్చారు.
ఇంతకీ బెదురులంక ఏంటి? కథ ఏంటి అసలు చూడచ్చా లేదా అని అనుకుంటున్నారా? 2012లో యుగాంతం పుకార్ల కారణంగా బెదురులంక అనే ఊరి ప్రజలు భయాందోళనలకు గురవుతుంటారు. ప్రజల్లోని భయం, అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని భూషణం అనే లీడర్ ఊరిని దోచుకోవాలని ప్లాన్ చేస్తాడు. అతడి పన్నాగాన్ని శివ ఎలా ఎదురించాడు? అనేది సినిమా.
తాను చేస్తున్న పనిలో అతడికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి. ఊరి ప్రెసిడెంట్ కూతురు చిత్రతో శివ ప్రేమాయణం ఎలా మొదలైందన్నదే బెదురులంక 2012 మూవీ కథ. కామెడీతో పాటు అంతర్లీనంగా ఓ చిన్న మెసేజ్‌ను టచ్ చేస్తూ డైరెక్టర్ క్లాక్స్ బెదురులంక 2012 మూవీని తెరకెక్కించాడు. అయితే ఈ సినిమాపై కొందరు పాజిటివ్ గా స్పందిస్తే.. మరికొందరు పెద్ద స్టోరీ లేదు బాస్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా ఓటీటీలో వచ్చింది కాబట్టి అందరూ చూస్తారు అని నేహా, శివ అభిమానులు అనుకుంటున్నారు. కానీ డీజే టిల్లుతో నేహ, ఆర్ ఎక్స్ 100 తో శివ మంచి పేరు సంపాదించారు. కానీ వారికి ఆ రేంజ్ లో హిట్ అయితే తేలేదు బెదురులంక.