Meenakshi Chaudhary: ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన మీనాక్షి చౌదరి, ఆ తర్వాత సినిమాగా ‘ఖిలాడి’ చేసింది. రవితేజ హీరోగా రమేష్ వర్మ రూపొందించిన ఈ సినిమా 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మీనాక్షి మాట్లాడుతూ “నా రెండో సినిమానే రవితేజతో కలిసి చేస్తానని అనుకోలేదు. ఈ సినిమా కోసం చాలామంది సీనియర్ ఆర్టిస్టులు పనిచేశారు. తప్పకుండా పెద్ద హిట్ అవుతుందనే నమ్మకం ఉందని ఈ మిస్ ఇండియా నమ్మకంగా ఉంది.

మొత్తానికి ‘ఖిలాడి’ తప్పకుండా పెద్ద హిట్ అవుతుంది మీనాక్షి చెప్పుకొచ్చింది. అన్నట్టు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కి మీనాక్షి చౌదరి ప్రేయసిగా నటించబోతుందట. హై వోల్టేజ్ యాక్షన్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రానున్న ‘సలార్’ సినిమాలో ప్రభాస్ తో కొన్ని కీలక సన్నివేశాల్లో మీనాక్షి చౌదరి కనిపించబోతుందని.. ఆమె ఓ ఉన్నతాధికారి పాత్రలో కనిపించబోతుందని తెలుస్తోంది.
Also Read: సినీ తారల తాజా ఇంట్రెస్టింగ్ పోస్ట్ లు
రానున్న ‘సలార్’ కొత్త షెడ్యూల్ లో మీనాక్షి చౌదరి పార్ట్ తీయబోతున్నారు. మొత్తానికి మీనాక్షి చౌదరి కెరీర్ ఈ సినిమాతో టర్న్ అయినట్టే. ఇప్పుడిప్పుడే తెలుగులో లైమ్ లైట్ లోకి రావడానికి తెగ ప్రయత్నాలు చేస్తోన్న మీనాక్షి చౌదరికి, ఇది గోల్డన్ ఛాన్స్ లాంటిదే. ఇప్పటికే మీనాక్షి చౌదరి ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ అనే సినిమాలో నటించింది.

ఇప్పటికే విడుదలై మంచి టాక్ తెచ్చుకున్న ఈ సినిమాలో ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. అలాగే మీనాక్షి చౌదరి ప్రస్తుతం ‘ఖిలాడీ’తో ‘హిట్-2’ సినిమా కూడా చేస్తోంది. ఇప్పుడు ఆమె ఖాతాలో ‘సలార్’ కూడా చేరింది.
Also Read: కోడి పుంజును కూడా వదలని బస్ కండక్టర్