https://oktelugu.com/

Beast Movie Review: రివ్యూ : బీస్ట్

Beast Movie Review: నటీనటులు: విజయ్, పూజా హెగ్డే, సెల్వరాఘవన్, యోగి బాబు తదితరులు దర్శకుడు: నెల్సన్ దిలీప్‌ కుమార్ నిర్మాణం : సన్ పిక్చర్స్ సంగీత దర్శకుడు: అనిరుధ్ రవిచందర్ సినిమాటోగ్రఫీ: మనోజ్ పరమహంస ఎడిటర్: ఆర్. నిర్మల్ తమిళ స్టార్ హీరో విజయ్ హీరోగా పూజ హెగ్డే హీరయిన్ గా టాలెంటెడ్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన సినిమా ‘బీస్ట్’. మరి ఈ సినిమా ఈ రోజు రిలీజ్ అయింది. మరి […]

Written By: Shiva, Updated On : April 14, 2022 3:29 pm
Follow us on

Beast Movie Review: నటీనటులు: విజయ్, పూజా హెగ్డే, సెల్వరాఘవన్, యోగి బాబు తదితరులు

దర్శకుడు: నెల్సన్ దిలీప్‌ కుమార్

నిర్మాణం : సన్ పిక్చర్స్

సంగీత దర్శకుడు: అనిరుధ్ రవిచందర్

సినిమాటోగ్రఫీ: మనోజ్ పరమహంస

ఎడిటర్: ఆర్. నిర్మల్

తమిళ స్టార్ హీరో విజయ్ హీరోగా పూజ హెగ్డే హీరయిన్ గా టాలెంటెడ్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన సినిమా ‘బీస్ట్’. మరి ఈ సినిమా ఈ రోజు రిలీజ్ అయింది. మరి ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో రివ్యూలోకి వెళ్లి తెలుసుకుందాం !

Beast Movie Review

Beast Movie Review

కథ :

‘రా’ ఏజెంట్ గా వీర రాఘవ (విజయ్)కి నేషనల్ రేంజ్ లో గుడ్ నేమ్ ఉంటుంది. దాంతో, ఉమర్ ఫరూక్‌ అనే టెర్రరిస్ట్ లీడర్ ను పట్టుకునే మిషన్‌ ను లీడ్ చేస్తాడు. వీర రాఘవ సక్సెస్ ఫుల్ గా ఆ టెర్రరిస్టు లీడర్ ను పట్టుకుంటాడు. కానీ, ఈ క్రమంలో తన చేతిలో పొరపాటున ఓ పాప చనిపోతుంది. తన వల్లే ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది అని వీర ‘రా’ నుంచి బయటకు వచ్చేస్తాడు. కొన్ని నెలల తర్వాత జరిగిన కొన్ని సంఘటనల అనంతరం వీరాను చూసి ప్రీతి (పూజ హెగ్డే) ప్రేమిస్తోంది. అంతలో చెన్నైలోని ఈస్ట్ కోస్ట్ మాల్ ను టెర్రరిస్ట్ లు ముట్టడి చేసి ఉమర్ ఫరూక్‌ను విడుదల చేయాలని డిమాండ్ చేస్తారు. సమయంలో ఆ మాల్‌ లోనే ఉన్న వీరా ఉగ్రవాదుల నుంచి ప్రజలను ఎలా కాపాడాడు ? ఈ క్రమంలో వీర ఎలాంటి రిస్క్ లు చేశాడు ? అనేది మెయిన్ కథ.

Also Read: Visakhapatnam- YCP: సాగర నగరంలో సంకట స్థితి.. విశాఖలో వైసీపీ సెల్ఫ్ గోల్

విశ్లేషణ :

విజయ్ ఈ సినిమాలో డిఫరెంట్ క్యారెక్టర్ లో తన క్యారెక్టరైజేషన్ తో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా తన పాత్రలో షేడ్స్ ను చాలా బాగా పలికించాడు. ఇంటర్వెల్ సీన్స్ లో మంచి ఎమోషనల్ టైమింగ్ తో చాలా బాగా ఆకట్టుకున్నాడు. అలాగే ఫస్ట్ హాఫ్ లో వచ్చే లవ్ సీక్వెన్స్ లో అండ్ మిగిలిన యాక్షన్ సీన్స్ లో కూడా విజయ్ సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో తన పాత్రకి పూర్తి న్యాయం చేశాడు.

Beast Movie Review

Beast Movie Review

ఇక పాత్ర‌లు, వాటి ప‌రిచ‌యం, కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు సాగుతూ.. సినిమా పై జోష్ పెంచాయి. కానీ ద్వితీయార్థంలో క‌థ మ‌ళ్లీ నెమ్మ‌దిస్తుంది. అయితే కొన్ని సీన్స్ లో ఎమోష‌న్స్ పండినా… ప్ర‌తీ పాత్ర‌కూ జస్ట్ జ‌స్టిఫికేష‌న్ ఇవ్వటానికి తప్ప ఇంట్రెస్ట్ కలిగించలేదు.
పైగా దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ రాసుకున్న స్టార్టింగ్ సీన్స్ కూడా స్లోగా ఉన్నాయి. అలాగే లవ్ ట్రాక్ కి సంబంధించి మరింత డిటైల్డ్ గా చూపించి ఉంటే.. సినిమా ఇంకా బెటర్ గా ఉండేది.

ప్లస్ పాయింట్స్ :

విజయ్ నటన,

మెయిన్ పాయింట్, కథలోని యాక్షన్

ప్రీ క్లైమాక్స్ సన్నివేశాలు,

సంగీతం,

మైనస్ పాయింట్స్ :

సింపుల్ స్టోరీ,

రొటీన్ స్క్రీన్ ప్లే,

సెకండాఫ్ స్లోగా సాగడం,

సినిమాటిక్ టోన్ ఎక్కువ అవ్వడం,

హీరో – హీరోయిన్ లవ్ ట్రాక్.

లాజిక్ లెస్ డ్రామా.

సినిమా చూడాలా ? వద్దా ? :

భిన్నమైన యాక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామాగా వచ్చిన ఈ బీస్ట్ ఫుల్ యాక్షన్ మోడ్ లో సాగుతూ విజయ్ ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటుంది. కానీ, బోరింగ్ సీన్స్ తో గ్రిప్పింగ్ నరేషన్ మిస్ కావడం, కథలో ఎక్కడా సహజత్వం లేకపోవడం వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి. ప్రేక్షకులకు ఈ సినిమా కనెక్ట్ కాదు.

రేటింగ్ 2.25 / 5

Also Read:Star Hero: టాలీవుడ్ లో రూ.100 కోట్ల క్ల‌బ్‌లో చేర‌ని ఏకైక స్టార్ హీరో ఎవ‌రో తెలుసా..?

Beast Movie Review || Thalapathy Vijay || Nelson || Anirudh || Oktelugu Entertainment

Tags