Beast 5 Days Collections: వరుస హిట్స్ తో బాక్స్ ఆఫీస్ కి ఊపిరి ఆడకుండా చేస్తున్న తమిళ స్టార్ హీరో విజయ్ కి బీస్ట్ సినిమా రూపం లో పెద్ద బ్రేక్ పడిన సంగతి మన అందరికి తెలిసిందే..బ్లాక్ బస్టర్ సాంగ్స్ తో ఒక్క తమిళ్ లోనే కాకుండా తెలుగు లో కూడా అద్భుతమైన బజ్ ని ఏర్పర్చుకుంది ఈ సినిమా…విజయ్ గత చిత్రం మాస్టర్ మూవీ తెలుగు లో కూడా సూపర్ హిట్ అవ్వడం తో ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా విజయ్ గత సినిమాలకంటే మూడింతలు ఎక్కువగా జరిగింది..కానీ విడుదల అయినా మొదటి రోజు మొదటి ఆట నుండే ఫ్లాప్ టాక్ రావడం తో తెలుగు లో కూడా ఈ సినిమాకి భారీ నష్టాలు తప్పలేదు..తమిళనాడు , కేరళ , బెంగళూరు ఇలా ప్రతి ప్రాంతం లో బయ్యర్లకు ఈ సినిమా భారీ నష్టాలను మిగిలించింది..కానీ ఓవర్సీస్ లో మాత్రం ఈ సినిమా కాస్త మెరుగైన వసూళ్లను సాధించి కొన్ని స్టేట్స్ లో బ్రేక్ ఈవెన్ మార్కు కి దగ్గరగా వెళ్ళింది..5 రోజులకు గాను ఈ సినిమా ఎంత వసూలు చేసింది అనేది ఇప్పుడు మనం చూడబోతున్నాము.
తెలుగు లో ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపుగా 10 కోట్ల రూపాయిల వరుకు జరిగింది..మొదటి రోజు ఓపెనింగ్ వరుకు పర్వాలేదు అనిపించినా..రెండవ రోజు నుండి మాత్రం వసూళ్లు దారుణంగా పడిపోయాయి..రెండు పండగ సెలవలు మరియు వీకెండ్ ని కూడా ఈ సినిమా తెలుగు లో సరిగ్గా ఉపయోగించుకోలేకపోయింది..5 రోజులకు గాను ఈ సినిమా ఇక్కడ 7 కోట్ల 30 లక్షల రూపాయిల షేర్ ని వసూలు చేసింది..ఇక లాంగ్ రన్ అసాధ్యం అనే ట్రెండ్ కనిపిస్తూ ఉండడం తో ఈ సినిమాని కొన్న బయ్యర్లకు రెండు కోట్ల రూపాయలకు పైగానే నష్టాలు వచ్చినట్టు సమాచారం..ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వసూళ్లు చూస్తూ ఉంటె KGF చాప్టర్ 2 బాక్స్ ఆఫీస్ సునామి ప్రభావం చాలా గట్టిగానే పడింది అని చెప్పాలి..కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు..విజయ్ కంచు కోట తమిళనాడు లో కూడా KGF ప్రబంజనం ముందు నిలబడలేకపోయింది బీస్ట్..విజయ్ కి ఉన్న స్టార్ స్టేటస్ వల్ల వీకెండ్ వరుకు ఈ సినిమాకి అక్కడ మంచి వసూళ్లే వచ్చినప్పటికీ..సోమవారం నుండి దారుణమైన ట్రెండ్ కనిపిస్తుండడం తో ఈ సినిమా తమిళనాడు లో కూడా చివరికి ఫ్లాప్ గా నిలసీహే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.
Also Read: ‘ఓటీటీ’ : ఈ వారం ‘ఓటీటీ’ చిత్రాల పరిస్థితేంటి ?
తమిళనాడు లో ఈ సినిమా 5 రోజులకు గాను 90 కోట్ల రూపాయిలు గ్రాస్ ని వసూలు చేసినట్టు తమిళ ట్రేడ్ వర్గాల అంచనా..ఇది మంచి వసూళ్లే అయ్యినప్పటికీ బ్రేక్ ఈవెన్ కి ఇది ఏ మాత్రం సరిపోదు అనే చెప్పాలి..కానీ ఓవర్సీస్ లో మాత్రం ఈ సినిమా అద్భుతమైన వసూళ్లను రాబట్టింది..అమెరికా లో ఈ సినిమాని 15 లక్షల డాలర్స్ కి కొనుగోలు చెయ్యగా కేవలం 5 రోజుల్లోనే ఈ సినిమా 14 లక్షల డాలర్లు వసూలు చేసి బ్రేక్ ఈవెన్ మార్క్ కి దగ్గరకి వెళ్ళింది..ఫుల్ రన్ లో ఈ ప్రాంతం లో బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకొని లాభాలు కూడా వచ్చే అవకాశం ఉంది అని ట్రేడ్ వర్గాల అంచనా..కేవలం ఇక్కడ ఒక్కటే కాదు ఆస్ట్రేలియా , మలేసియా , ఫ్రాన్స్ , శ్రీలంక మరియుఈ దుబాయి వంటి స్టేట్స్ లో కూడా ఈ సినిమాకి అద్భుతమైన వసూలు వచ్చాయి..ఓవర్సీస్ లో మంచి లాభాలే వచ్చినప్పటికీ ఇండియా లో మాత్రం భారీ నష్టాలు తప్పేలా లేదు..మొత్తం మీద ప్రపంచ వ్యాప్తంగా 5 రోజులకు గాను ఈ సినిమా 168 కోట్ల రూపాయిల గ్రాస్ ని వసూలు చేసింది..ఈ మూవీ బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవాలి అంటే కచ్చితంగా 240 కోట్ల రూపాయిల గ్రాస్ ని వసూలు చెయ్యాల్సిన అవసరం ఉంది..ప్రస్తుతం ట్రెండ్ ని బట్టి చూస్తుంటే అది బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవడం అసాధ్యం అనే చెప్పాలి..దాని వల్ల చాలా కాలం తర్వాత విజయ్ కి ఒక్క పెద్ద ఫ్లాప్ బీస్ట్ రూపం లో ఎదురు అయ్యింది అని అభిమానులు నిరాశకి గురి అయ్యారు.
Also Read: మహేష్ బాబు – బోయపాటి శ్రీను కాంబినేషన్ లో భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ మూవీ
Recommended Videos: