https://oktelugu.com/

Bangarraju Movie: సెంటిమెంట్‌ను ఫాలో అవుతున్న బంగార్రాజు…

Bangarraju Movie: అక్కినేని నాగార్జున హీరో కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘బంగార్రాజు’.  సోగ్గాడే చిన్ని నాయానా సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న వీరిద్దరూ ఇప్పుడు సీక్వెల్‌గా తెరకెక్కుతోన్న ‘బంగార్రాజు’తో ప్రేక్షకులను మరోసారి మెస్మరైజ్‌ చేయడానికి వస్తున్నారు. నిజానికి ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా కరోనా కారణంగా షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది. అయితే ఎట్టకేలకు చిత్ర యూనిట్ సినిమాను పూర్తి చేసే పనిలో పడింది. ఈ సినిమాలో నాగార్జునతో పాటు నాగచైతన్య […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : October 19, 2021 / 06:03 PM IST
    Follow us on

    Bangarraju Movie: అక్కినేని నాగార్జున హీరో కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘బంగార్రాజు’.  సోగ్గాడే చిన్ని నాయానా సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న వీరిద్దరూ ఇప్పుడు సీక్వెల్‌గా తెరకెక్కుతోన్న ‘బంగార్రాజు’తో ప్రేక్షకులను మరోసారి మెస్మరైజ్‌ చేయడానికి వస్తున్నారు. నిజానికి ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా కరోనా కారణంగా షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది. అయితే ఎట్టకేలకు చిత్ర యూనిట్ సినిమాను పూర్తి చేసే పనిలో పడింది. ఈ సినిమాలో నాగార్జునతో పాటు నాగచైతన్య కూడా నటిస్తున్నారు. చైతూకు జోడీగా కృతి శెట్టి నటిస్తుండగా, నాగార్జునకు జంటగా రమ్యకృష్ణ కనిపించనుంది. ఇక గతంలో చాలా సార్లు ఈ సినిమా విడుదల తేదీకి సంబంధించి వార్తలు వచ్చినప్పటికీ ఏదీ ఫైనల్‌ కాలేదు.

    తాజాగా ఈ సినిమా విడుదలకు సంబంధించి ఓ వార్త ఆసక్తిని రేకెత్తిస్తోంది. బంగార్రాజు చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయడానికి చిత్ర యూనిట్‌ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. జనవర్‌ 15న సినిమాను విడుదల చేయనున్నట్లు సమాచారం. అయితే ఈ విషయంలో చిత్ర యూనిట్‌ ఓ సెంట్‌మెంట్‌ను ఫాలోఅవుతున్నట్లు కనిపిస్తోంది.

    సోగ్గాడే చిన్ని నాయనా చిత్రం 2016లో సంక్రాంతి కానుకగా జనవరి 15న విడుదలైంది. ఇప్పుడు సరిగ్గా ఐదేళ్ల తర్వాత సీక్వెల్‌ను అదే రోజు విడుదల చేయనున్నారన్నమాట. అయితే వచ్చే సంక్రాంతికి సినిమాల పోటీ తీవ్రంగా ఉండేలా కనిపిస్తోంది. మరి ఈ పోటీలోకి బంగార్రాజు దిగుతాడా.. లేదా తెలియాలంటే చిత్ర విడుదలపై అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాలి. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.