Bangarraju Box Office Collection: అక్కినేని నాగార్జున – నాగచైతన్య కలయికలో వచ్చిన సినిమా భారీ అంచనాల మధ్య వచ్చి మొదటి రోజు నుంచి బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్లను రాబడుతుంది. కాకపోతే, సునామీ కలెక్షన్లను ఏమి రాబట్టలేక పోతుంది అనుకోండి. కాకపోతే ఈ సినిమా రిలీజ్ అయి ఎనిమిది రోజులు అవుతున్నా ఇంకా కొన్ని ఏరియాల్లో బాగానే కలెక్ట్ చేసింది. మొత్తమ్మీద కలెక్షన్స్ విషయంలో బంగార్రాజు ఏ మాత్రం తగ్గ లేదు. నిజానికి ఈ సినిమా కేవలం బ్రేక్ ఈవెన్ కిందే రిలీజ్ అయింది. సినిమాని ముందే జీ5 కి అమ్మేసుకున్నారు. అందుకే, ఫస్ట్ డే నుంచి ఈ సినిమా పూర్తి లాభాల్లోనే నడుస్తోంది. మరి లేటెస్ట్ కలేక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం.
ఈ చిత్రం 8వ రోజు కలెక్షన్ల వివరాలను ఒకసారి గమనిస్తే :
నైజాం 7.72 కోట్లు
సీడెడ్ 6.76 కోట్లు
ఉత్తరాంధ్ర 4.36 కోట్లు
ఈస్ట్ 3.62 కోట్లు
వెస్ట్ 2.60 కోట్లు
గుంటూరు 3.06 కోట్లు
కృష్ణా 1.98 కోట్లు
నెల్లూరు 1.69 కోట్లు
‘బంగార్రాజు’ సినిమాకు రూ.38.31 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగిందని లెక్కలు చెబుతున్నాయి. అంటే.. ఈ సినిమా బయర్లకు బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే రూ.39 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. కాగా 8 రోజులు పూర్తయ్యేసరికి ఈ సినిమా రూ. .34.79 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసింది. ఇక బ్రేక్ ఈవెన్ కు మరో రూ. 4.21 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టాల్సి ఉంది. కాగా రెండో శుక్రవారం నాడు కూడా ఈ సినిమాకి 0.47 కోట్లకి పైగా షేర్ వచ్చింది. కాకపోతే నైజాంలో మాత్రం ఈ సినిమాకు ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ రావడం లేదు. మొత్తమ్మీద ‘బంగార్రాజు’ ఏవరేజ్ రేంజ్ లో కలెక్షన్స్ ను రాబడుతుంది.