
Sai Dharma Tej Accident: మెగా హీరో సాయిధరమ్ తేజ్ నిన్నరాత్రి బైక్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని అపోలో ఆస్పత్రి వైద్యులు హెల్త్ బులిటెన్ లో పేర్కొన్నారు. హెల్మెంట్ ధరించడంతో పెద్ద ప్రమాదం తప్పిందని వైద్యులు తెలిపారు. నిర్లక్ష్యంగా వ్యవహరించడం.. అతి వేంగా బైక్ నడపడంతో అతడిపై కేసు కూడా నమోదు చేసినట్టు తెలిపారు. ఇక యాక్సిడెంట్ ప్రాంతంలో ఇసుక ఉండడంతో అధికారులు ఆ ప్రాంతాన్ని శుభ్రం చేశారు.
సాయిధరమ్ తేజ్ యాక్సిడెంట్ విషయం తెలియగా.. టాలీవుడ్ లోని సినీ ప్రముఖులంతా ఆస్పత్రికి తరలివచ్చారు. కుటుంబ సభ్యులైన చిరంజీవి, పవన్, నాగబాబు, వరుణ్ తేజ్, నిహారిక, వైష్ణవ్ తేజ్, అల్లు అరవింద్, అల్లు అర్జున్ లు ఆస్పత్రిలోనే ఉండి సాయితేజ్ ఆరోగ్యంపై ఆరాతీస్తున్నారు.
మరోవైపు సోషల్ మీడియాలో సాయిధరమ్ తేజ్ బైక్ ప్రమాదం, దానికి సంబంధించిన విజువల్స్ వైరల్ అవుతున్నాయి. అతడు త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్థిస్తున్నారు.
మెగా ఫ్యామిలీ భక్తుడైన నటుడు, నిర్మాత బండ్ల గణేష్ సైతం సాయిధరమ్ తేజ్ యాక్సిడెంట్ పై ట్వీట్ చేశాడు. సంచలన వ్యాఖ్యలు చేశారు.‘సుప్రీం హీరో త్వరగా కోలుకోవాలని ప్రార్థించాడు.
‘దేవుడు నీతోనే ఉన్నాడు సాయిధరమ్ తేజ్. ఆయన ఇప్పుడు బాగానే ఉన్నారు.కోలుకుంటున్నారు. ఆందోళన చెందకండి. ఆస్పత్రిలో మెరుగైన వైద్యాన్ని అందిస్తున్నారు’ అని బండ్ల గణేష్ ట్వీట్ చేశాడు. ప్రతి విషయంలో డిఫెరెంట్ గా స్పందించే బండ్ల గణేష్ తాజాగా సాయిధరమ్ ప్రమాదంపై కూడా దేవుడిపై భారం వేసి స్పందించాడు.
God always with you @IamSaiDharamTej is absolutely fine and recovering. Nothing to worry. He is under precautionary care in hospital.
— BANDLA GANESH. (@ganeshbandla) September 10, 2021