https://oktelugu.com/

నిజమే.. పవన్ కళ్యాణ్ పేరును నిలబెట్టాడు !

‘బండ్ల గణేష్‌’… పవన్ కళ్యాణ్ భక్తుడిగా నిర్మాతగా పరిచయం అవసరం లేని పేరు. అయితే బండ్ల గణేష్ లో ఆవేశమే కాదు, సాయం చేసే గుణం కూడా ఉంది. తాజాగా ఓ వ్యక్తి బండ్లను సహాయం కోరుతూ ట్వీట్ చేసాడు. ‘నమస్కారం అన్న. మా అన్నయ్య బండ్ల లింగయ్యకు ఆటో ప్రమాదం జరిగింది. ఆపరేషన్ చేసి 48 కుట్లు వేశారు. 6 నెలల వరకు డాక్టర్లు ఇంట్లోనే ఉండమన్నారు. ఆర్థికంగా చాలా ఇబ్బందిగా ఉంది. ఎవరూ స్పందించడం […]

Written By: , Updated On : July 15, 2021 / 01:37 PM IST
Follow us on

Bandla Ganesh helps poor family‘బండ్ల గణేష్‌’… పవన్ కళ్యాణ్ భక్తుడిగా నిర్మాతగా పరిచయం అవసరం లేని పేరు. అయితే బండ్ల గణేష్ లో ఆవేశమే కాదు, సాయం చేసే గుణం కూడా ఉంది. తాజాగా ఓ వ్యక్తి బండ్లను సహాయం కోరుతూ ట్వీట్ చేసాడు. ‘నమస్కారం అన్న. మా అన్నయ్య బండ్ల లింగయ్యకు ఆటో ప్రమాదం జరిగింది. ఆపరేషన్ చేసి 48 కుట్లు వేశారు. 6 నెలల వరకు డాక్టర్లు ఇంట్లోనే ఉండమన్నారు.

ఆర్థికంగా చాలా ఇబ్బందిగా ఉంది. ఎవరూ స్పందించడం లేదు. మీరైనా కొంచెం ఆదుకోండి గణేష్‌ అన్న. ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు’ అంటూ ఆ వ్యక్తి బండ్ల గణేష్‌ ను వేడుకున్నాడు. అయితే సహజంగా ఇలాంటి మెసేజ్ లకు ఎవరు స్పందించరు. కానీ, బండ్ల గణేష్ స్పందించాడు. సాయం అవసరం అయిన వ్యక్తి గూగుల్‌ పే నెంబర్‌ పంపించమని సదరు వ్యక్తిని కోరాడు బండ్ల.

ప్రస్తుతం దీనికి సంబంధించిన ట్వీట్‌ సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది. ఇలా సాయం కోరిన వెంటనే బండ్ల గణేష్‌ ముందుకు రావడం వెనుక, సాయం కోరిన అతనిది తన ఇంటి పేరే అని, అందుకే బండ్ల సాయం చేశాడని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అయినా ఇలాంటి విషయంలో కామెంట్స్ కాదు చేయాల్సింది, ప్రశంసలు కురిపించాలి.

ఏది ఏమైనా బండ్ల గణేష్, పవన్ కళ్యాణ్ పేరును నిలబెట్టాడని పవన్ ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇక ఒక చిన్న కమెడియన్‌ గా ఎంట్రీ ఇచ్చిన బండ్ల గణేష్, ఉన్నట్లుండి నిర్మాతగా మారడం, దానికి తోడు స్టార్‌ హీరోలతో సినిమాలు తీసి, సూపర్‌ హిట్లు కొట్టడంతో బండ్ల టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయిపోయాడు. ఒకటి మాత్రం నిజం, బండ్లకు సినిమాల కంటే కూడా సోషల్‌ మీడియా ద్వారానే ఎక్కువ పాపులారిటీ దక్కింది.