Homeఎంటర్టైన్మెంట్Bandla Ganesh: ఓ ఇంటరెస్టింగ్ బయోపిక్‌ ను తెరకెక్కించనున్న బండ్ల గణేష్...

Bandla Ganesh: ఓ ఇంటరెస్టింగ్ బయోపిక్‌ ను తెరకెక్కించనున్న బండ్ల గణేష్…

Bandla Ganesh: బండ్ల గణేశ్… కమెడియన్ గా, నిర్మాతగా ఆయనకు ఇండస్ట్రి లో మంచి పేరు ఉందనే చెప్పాలి. ముఖ్యంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ల లోనూ, ఫంక్షన్ ల లోనూ ఆయన స్పీచ్ లకు సపరేట్ ఫ్యాన్స్ ఉంటారంటే అతిశయోక్తి కాదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు వీరాభిమానినని చెప్పుకునే బండ్ల గణేశ్ … మెగా ఫ్యామిలి ని బాగా ఇష్టపడతారని అందరికీ తెలిసిందే. అలానే రాజకీయాల పరంగాను ఎంట్రీ ఇచ్చి … పలు వ్యాఖ్యలతో మీడియా లో హాట్ టాపిక్ గా నిలిచారు. ప్రస్తుతం బండ్ల గణేశ్ హీరో గా ఓ సినిమాలో నటిస్తున్న విషయం కూడా మీడియా లో హాట్ టాపిక్ గా నడుస్తుంది. అయితే ఇప్పుడు ఆయన తీసుకున్న ఒక నిర్ణయం పట్ల సినీ వర్గాల్లో మరోసారి చర్చించుకుంటున్నారు.

bandla-ganesh-going to make sachidananda swamy biopic

ఇటీవల ఆధ్యాత్మిక గురువు శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి ఆశ్రమాన్ని… బండ్ల గణేశ్ సందర్శించారు. ఈ మేరకు ఆయనను దర్శించుకున్న విషయాన్ని ట్విట్టర్‌లో అధికారికంగా పోస్ట్ చేశారు. ఇక్కడే ఓ ఆసక్తికరమైన వార్తను ప్రకటించారు బండ్ల. సచ్చిదానంద స్వామి జీవితంపై ఒక సినిమాను తెరకెక్కించబోతున్నట్లు ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చారు గణేష్.

https://twitter.com/ganeshbandla/status/1452108703612616708?s=20

ఈ పోస్ట్ లో ” అప్పాజీ జీవిత చరిత్ర సినిమా చేసి తీరతా… ఆయన పాదాల సాక్షిగా అనుమతించారు. ఎవరి అదృష్టాన్ని ఎవరూ ఆపలేరు” అంటూ స్వామీజీతో దిగిన ఫోటోను గణేష్ ట్వీట్ చేశాడు. ఈ చిత్రానికి సంబంధించి మరే వివరాలను ఆయన వెల్లడించలేదు. కాగా సచ్చిదానంద స్వామి పాత్రను ఎవరు పోషిస్తారు… తదితర సినిమా వివరాల గురించి సినివర్గాల్లో చర్చ మొదలైంది. రాజకీయాల నేపధ్యంలో కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్న బండ్ల … గతేడాది ‘సరిలేరు నీకెవ్వరు’ లో కమెడియన్ గా నటించి మెప్పించారు. ఆయన హీరోగా చేస్తున్న ” డేగల బాబ్జీ ” చిత్రం డబ్బింగ్ శరవేగంగా జరుగుతున్నట్లు ఇటీవలే ట్విట్టర్ లో పోస్ట్ చేశారు గణేష్.

 

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular