spot_img
Homeఎంటర్టైన్మెంట్Bandla Ganesh Daughter Wedding: గ్రాండ్ మొదలైన నిర్మాత బండ్ల గణేష్ కూతురు వివాహ వేడుకలు.....

Bandla Ganesh Daughter Wedding: గ్రాండ్ మొదలైన నిర్మాత బండ్ల గణేష్ కూతురు వివాహ వేడుకలు.. పెళ్లి కొడుకు ఎవరో మీరే చూడండి..

Bandla Ganesh Daughter Wedding: టాలీవుడ్ లో ఒక చిన్న కమెడియన్ గా కెరీర్ ని ప్రారంభించి, ఆ తర్వాత నిర్మాతగా మారి గబ్బర్ సింగ్, బాద్ షా, టెంపర్ ఇలా ఎన్నో సూపర్ హిట్ సినిమాలను నిర్మించి , టాలీవుడ్ లో టాప్ నిర్మాతగా తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ఇమేజ్ ని సంపాదించుకున్న వ్యక్తి బండ్ల గణేష్(Bandla Ganesh). కేవలం సినీ రంగం లోనే కాదు, వ్యాపార రంగం లో కూడా ఈయన గొప్పగా రాణించాడు. రాజకీయాల్లో కూడా రాణించేందుకు ప్రయత్నాలు చేసాడు కానీ , పెద్దగా ఏమి వర్కౌట్ అవ్వలేదు. ముఖ్యంగా ఈయన పవన్ కళ్యాణ్ భక్తుడిగా ఏ రేంజ్ లో క్రేజ్ సంపాదించాడో మన అందరికీ తెలిసిందే. ఆయన గురించి మాట్లాడేటప్పుడు పూనకాలొచ్చి ఊగిపోతూ ఉంటాడు బండ్ల గణేష్. ఇదంతా పక్కన పెడితే బండ్ల గణేష్ కి జనని అనే కుమార్తె ఉంది.

రీసెంట్ గానే ఈమెకు పెళ్లి ఫిక్స్ అయ్యింది. పెళ్లి కొడుకు పేరు చిలుకూరు సూర్య తేజ. త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న ఈ జంటకు నేడు పసుపు కార్యక్రమం నిర్వహించారు. అందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. పెళ్లి కొడుకు సూర్య చూసేందుకు కుర్ర హీరోలాగానే ఉన్నాడు. ఈయన్ని పెట్టి భవిష్యత్తులో బండ్ల గణేష్ సినిమాలు తీసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అయితే వృత్తి పరంగా సూర్య తేజ ఐటీ రంగం లో కొనసాగుతున్నాడు. ఇక బండ్ల గణేష్ కూతురు విషయానికి వస్తే , ఈమె కూడా అందం లో ఏ మాత్రం తక్కువగా లేదు. చక్కటి తెలుగింటి హీరోయిన్ లాగా కనిపిస్తుంది. వీళ్లిద్దరి జోడీ చూసేందుకు ఎంతో ముచ్చటగా కూడా ఉంది. సోషల్ మీడియా లో ఈ సందర్భంగా అభిమానుల నుండి ఈ జంటకు శుభాకాంక్షల వెల్లువ కురుస్తోంది. బండ్ల గణేష్ అంటే పవన్ కళ్యాణ్ అభిమానులకు ఎంతో అభిమానం అనే సంగతి తెలిసిందే. వాళ్ళు ఈ సందర్భంగా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇక బండ్ల గణేష్ విషయానికి వస్తే ఒకప్పుడు వరుస సినిమాలతో టాప్ నిర్మాతగా ఎదిగిన ఈయన , ఈమధ్య కాలం లో సినిమాలకు దూరం అయ్యాడు. కానీ రాబోయే రోజుల్లో గ్రాండ్ గా నిర్మాతగా మరోసారి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈసారి పెద్ద హీరోలతో కాకుండా, కొత్త వాళ్ళతో సినిమాలు చేసే ఆలోచనలో ఉన్నాడట బండ్ల గణేష్. త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు బయటకు రానున్నాయి. మరి బండ్ల గణేష్ సెకండ్ ఇన్నింగ్స్ ఒకప్పటి రేంజ్ లో ఉంటుందో లేదో చూడాలి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular