Akhanda 2 : బాలకృష్ణ.. ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ ఆఫ్ ది ఇండస్ట్రీగా దూసుకుపోతున్నారు. ఇటు వెండితెర మీద అటు బుల్లితెర మీద బాలయ్య ప్రభావం బాగా కనిపిస్తోంది. హిట్ల మీద హిట్లు కొడుతూ నిర్మాతల పాలిట కల్పవృక్షంలా మారిపోయారు. గాడ్ ఆఫ్ మాసెస్ గా నిరంతరం తన సినిమాలతో అలరిస్తున్నారు. ప్రస్తుతం బాలయ్య అన్ స్టాపబుల్ షోతో బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తూనే.. మరో పక్క వరుస సినిమాలతో వెండితెర ప్రేక్షకులకు దగ్గరగా ఉంటున్నారు. అప్పట్లో వరుస ప్లాపులతో కాస్త వెనుకబడ్డ బాలయ్య. సింహా తర్వాత నుంచి తన జులం విదిల్చారు. అఖండ, వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో హ్యాట్రిక్ విజయాలను అందుకుంటూనే రీసెంటుగా బాబీ డైరెక్షన్లో డాకు మహారాజ్ సినిమాతో డిసెంట్ హిట్ అందుకున్నారు. వరుస హిట్లు కొడుతున్న బాలయ్యను చూసి ఆయన అభిమానులు ఫుల్ ఖుషీగా ఉన్నారు. ప్రస్తుతం బాలయ్య చేతిలో చాలా సినిమాలు ఉన్నాయి. అయితే వాటన్నింటిలోకి క్రేజ్ ఉన్న మూవీ అఖండ సీక్వెల్. బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ2 తాండవం చేస్తున్న విషయం తెలిసిందే. బ్లాక్ బస్టర్ అఖండ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై అందరికీ భారీ అంచనాలు ఉన్నాయి. అసలే బాలయ్య- బోయపాటి అంటేనే సూపర్‌హిట్ కాంబినేషన్. వీరిద్దరి కలయికలో వచ్చిన ప్రతి సినిమా బాక్సాఫీసు బొనాంజాలే.
సింహా, లెజెండ్, అఖండ సినిమాలతో హ్యాట్రిక్ అందుకున్న బాలయ్య- బోయపాటి ఇప్పుడు అఖండ2 కోసం మరోసారి జత కట్టారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అఖండ2 స్క్రిప్ట్ ను బోయపాటి నెక్ట్స్ లెవెల్ లో రాసుకున్నట్లు తెలుస్తోంది. సినిమాలో గూస్‌బంప్స్ ఎలిమెంట్స్ చాలా ఉన్నాయంటూ యూనిట్ సభ్యులు సీక్రెట్గా చెబుతున్నారు. ఇక అసలు విషయానికొస్తే బాలయ్య అఖండ2 కు తన రెమ్యూనరేషన్ ను భారీగా పెంచినట్లు సమాచారం. సాధారణంగా బాలయ్య మిగతా హీరోలతో పోలిస్తే రెమ్యూనరేషన్ చాలా తక్కువగానే తీసుకుంటారన్న టాక్ ఉంది. మొన్నటి వరకు రూ.28 కోట్లు తీసుకున్న బాలయ్య ఏకంగా ఏడు కోట్లు పెంచి రూ.35 కోట్లు తీసుకుంటున్నారని తెలుస్తోంది. బాలయ్య మార్కెట్, హిట్ ట్రాక్ చూసి నిర్మాతలు కూడా బాలయ్య అడిగినంత ఇచ్చేందుకు రెడీ అంటున్నట్లు సమాచారం.
అయితే రీసెంట్ గా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కు బాలయ్య పోర్షే లగ్జరీ కారను గిఫ్టుగా ఇచ్చిన సంగతి తెలిసిందే. గత నాలుగు బాలయ్య సినిమాలకు తమనే మ్యూజిక్ డైరెక్టర్. తమన్ పనితనం నచ్చడంతో బాలయ్య దానికి కృతజ్ఞతగా ఈ కారును గిఫ్ట్ గా ఇచ్చారు. అయితే తమన్ కు బాలయ్య ఆ కారు కొనింది కూడా అఖండ2 రెమ్యూనరేషన్ లో నుంచే అని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇందులో నిజం ఎంత ఉందో తెలియాల్సి ఉంది.