Balakrishna
Unstoppable: ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా బాలయ్య సందడే కనిపిస్తోంది. బాలకృష్ణ హీరోగా బోయపాటి తెరకెక్కించిన సినిమా అఖండ. డిసెంబరు 2న విడుదల కానున్న సందర్భంగా ఈ సినిమాపై మంచి హైప్ క్రియేట్ చేశారు మేకర్స్. ఇటీవలే ప్రీ రిలీజ్ఈవెంట్ కూడా నిర్వహించి.. కొవిడ్ తర్వాత థియేటర్లలో విడుదలవుతున్న తొలి అతి పెద్ద సినిమాగా చెప్పుకొచ్చారు. కాగా, మరోవైపు ఓటీటీ వేదికైన ఆహాలో కూడా అన్‌స్టాపబుల్ షోతో అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ అందిస్తున్నారు బాలయ్య. తానే హోస్ట్‌గా వ్యవహరించి.. ప్రోమోలతోనే ఊపు తెప్పిస్తున్నారు.
Balakrishna
The energy is back to set your screens ablaze 🔥#NandamuriBalakrishna Garu is back in action to bring to you great conversations and celebrations. #UnstoppableWithNBK episode 3 promo coming soon.#MansionHouse @tnldoublehorse @swargaseema #NandGokulGhee #TilakNagarIndustries pic.twitter.com/S1aTPl2Exn
— ahavideoin (@ahavideoIN) November 29, 2021
Also Read: బాలయ్య అన్‌స్టాపబుల్ తర్వాత గెస్ట్‌గా బ్రహ్మి డార్లింగ్?
కాగా, ఇప్పటికే రెండు ఎపిసోడ్లు పూర్తి చేసుకున్న ఈ షో.. తాజాగా, మూడో ఎపిసోడ్‌కు సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేసింది ఆహా. బాలయ్య చేతికి అఖండ సినిమా షూటింగ్ సమయంలో గాయం తగిలి.. సర్జరీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో కొద్ది రోజులు షోకు గ్యాప్ వచ్చింది. తిరిగి శుక్రవారం అదే కట్టుతో షూటంగ్‌లో అడుగుపెట్టి.. బాలయ్య జోష్ పెంచారు. ఈ క్రమంలోనే మూడో ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోను ట్విట్టర్ వేదికగా విడుదల చేసింది ఆహా.
మూడు వారాల గ్యాప్ వచ్చింది. ఎన్నో మెసేజ్‌లు, ఎన్నో ఫోన్‌కాల్స్… నేనెలా ఉన్నానని అడగడానికి కాదు.. మూడో ఎపిసోడ్ ఎప్పుడా అని.. వారం వారం రావడనికి నేను సీరియల్‌ని కాదు.. సెలబ్రేషన్.. అంటూ బాలయ్య తనదైన స్టైల్ ఎనర్జీతో తిరిగి జోష్ పెంచారు. త్వరలోనే మూడో ఎపిసోడ్ ఎవరితో అన్న విషయాన్ని కూడా వెల్లడించనున్నారు.
Also Read: అందరి కళ్లు బాలయ్య చేతిపైనే.. అసలు ఆయనకు ఏమైంది?
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Read MoreWeb Title: Balayya unstoppable show third episode promo out now
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com