https://oktelugu.com/

Daku Maharaj : ‘డాకు మహారాజ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్ పై మైక్ విసిరిన బాలయ్య..వైరల్ అవుతున్న వీడియో!

నందమూరి బాలకృష్ణ నటించిన 'డాకు మహారాజ్' చిత్రం రేపు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదల అవ్వబోతున్న సంగతి తెలిసిందే.

Written By:
  • Vicky
  • , Updated On : January 11, 2025 / 01:33 PM IST

    Daku Maharaj

    Follow us on

    Daku Maharaj : నందమూరి బాలకృష్ణ నటించిన ‘డాకు మహారాజ్’ చిత్రం రేపు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదల అవ్వబోతున్న సంగతి తెలిసిందే. వరుసగా మూడు బ్లాక్ బస్టర్ హిట్స్ తర్వాత బాలయ్య నుండి విడుదల అవ్వబోతున్న సినిమా కావడంతో, దీనిపై మొదటి నుండి మంచి హైప్ ఏర్పడింది. పాటలు, ట్రైలర్ పెద్దగా క్లిక్ కాకపోయినప్పటికీ నిన్న విడుదల చేసిన రిలీజ్ ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ రావడంతో అడ్వాన్స్ బుకింగ్స్ భారీగా జరిగాయి. బాలయ్య కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టే సినిమాలలో ఈ చిత్రం కూడా ఒకటిగా నిలబడబోతుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇదంతా పక్కన పెడితే నిన్న ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో పెద్దగా హంగులు ఆర్భాటాలు లేకుండా చాలా సింపుల్ గా జరిగింది. మొదట అనంతపురం లో గ్రాండ్ గా చేద్దాం అనుకున్నారు కానీ, తిరుపతి లో తొక్కిసలాట ఘటనపై సంతాపం తెలుపుతూ ఈవెంట్ ని క్యాన్సిల్ చేసారు.

    ఇకపోతే హైదరాబాద్ లో సింపుల్ గా జరిగినటువంటి ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మూవీ టీం మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. బాలయ్య కూడా తన వైపు నుండి అదిరిపోయే రేంజ్ స్పీచ్ ఇచ్చాడు. సినిమా పై హైప్ పెంచే విధంగా మూవీ టీం మాట్లాడిన మాటలు చూస్తుంటే కచ్చితంగా బాలయ్య మరో భారీ హిట్ కొట్టబోతున్నాడని అర్థం అవుతుంది. ఇదంతా పక్కన పెడితే ఈ ఈవెంట్ మొత్తం బాలయ్య బాబు తన చేతిలో ఉన్న వస్తువులను గాల్లోకి స్టైల్ గా తిప్పి పట్టుకుంటున్నాడు. ముందుగా ఊర్వశి రౌతేలా పక్కన కూర్చున్నప్పుడు ఆయన తన చేతిలో ఉన్న ఫోన్ ని స్టైల్ గా తిప్పి పట్టుకుంటాడు. ఆ వీడియో తెగ వైరల్ గా మారింది. ప్రసంగం మొత్తం ముగిసిన తర్వాత డైరెక్టర్ బాబీ వైపుకు మైక్ విసురుతాడు.

    ఆ మైక్ క్యాచ్ పట్టబోయిన బాబీ, మిస్ అవ్వడం తో హీరోయిన్ ప్రజ్ఞా జైస్వాల్ కి తగులుతుంది. ఇలా ఈవెంట్ మొత్తం బాలయ్య చిన్న పిల్లోడిలాగా చిలిపి వేషాలు వేసాడు. ఇది ఆయన అభిమానులకు చూసేవాళ్లకు చాలా ఫన్నీ గా అనిపించింది. ఒకప్పుడు బాలయ్య మైక్ అందుకుంటే ఏమి మాట్లాడుతాడో ఆయనకే అర్థం కాదంటూ కామెంట్స్ చేసేవారు. కానీ ఈమధ్య ఆయన మాటల్లో చాలా స్పష్టత కనిపిస్తుంది. బాలయ్య లో ఇంత మార్పు ఎలా అని ఆయన అభిమానులు సైతం ఆశ్చర్యపోతున్నారు. బహుశా ‘అన్ స్టాపబుల్ ‘ టాక్ షో బాలయ్య బాబు ని బాగా మార్చేసి ఉండొచ్చు అని అంటున్నారు విశ్లేషకులు. ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గానే ఆయన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి ఒక ఎపిసోడ్ చేయగా, దానికి మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. రెండవ భాగం వచ్చే వారం స్ట్రీమింగ్ కానుంది.