Akhanda: బోయపాటి దర్శకత్వంలో బాలయ్య నటించిన సినిమా అఖండ.. డిసెంబరు 2న విడుదలైన ఈ సినిమా.. అన్ని ప్రాంతాల్లో విశేష స్పందన లభిస్తోంది. తెలుగు రాష్టాలతో పాటు విదేశాల్లోనూ బాలయ్య క్రేజ్ ఎక్కడా తగ్గట్లేదు. ఓపెనింగ్స్‌లోనే భారీ కలెక్షన్లు రాబట్టింది ఈ సినిమా. కాగా, ఈ సినిమాను బాలయ్యతో పాటు చిత్రబృందం ఏఎంబీ సినిమాస్‌లో వీక్షీంచింది. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రజల అద్భుతమైన ప్రతిస్పందనకు కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ సందర్భంగా బాలయ్య మాట్లాడుతూ..సనిమాకు వస్తోన్న స్పందన చాలా ఆనందాన్ని కలిగిస్తోంది. బోయపాటి ఈ సినిమాను ఎంతో గొప్పగా తెరకెక్కించాడు. ఓ నాడు రామారాపు భక్తిని బ్రతికిస్తే.. ఇప్పుడు అఖండ ఆ భక్తికి ఊపిరి పోసినట్లు అనిపిస్తోంది. అందుకు నిజంగా చాలా గర్వంగా ఉంది. ఈ సినిమాను అఖండమైన విజయం వైపు నడిపించిన ప్రేక్షకమహాసేయులందరికీ ధన్యవాదాలు. అని తెలిపారు.
దీంతో పాటు తెలుగు ప్రేక్షకులను ఉద్దేశిస్తూ..తెలుగు వాళ్లకు ఓ ప్రత్యేకత ఉంది. కొత్తదనాన్ని ఎప్పుడూ వాళ్లు స్వాగతిస్తారు. అందుకు నిదర్శనమే ఈ అఖండ. ఇంటర్వెల్లో చిన్న చిన్న పిల్లలు ఈ సినిమా గురించి మాట్లాడుకోవడం విని చాలా ఆనందమేసింది. ఈ సినిమా కేవలం నా విజయం కాదు.. సినీ పరిశ్రమకు విజయం. తెరపై నన్ను నేను చూసుకిని చాలా ఆశ్చర్యపేయా. థమన్ తన మ్యూజిక్‌తో సినిమాకు ప్రాణం పోశాడు. నేను దర్శకుడి ఆర్టిస్ట్‌ని. నేను కేవలం నా దర్శకుడి సూచనలను పాటిస్తాను. నాకు ప్రతి సినిమా సమానమే” అని బాలయ్య చెప్పుకొచ్చారు.
అనంతరం బోయపాటు మాట్లాడుతూ.. అఖండ సూపర్ హిట్ అని అందరూ చెబుతున్నారు. ఈ సినిమా కరోనా సెకెండ్‌వేవ్ తర్వాత వచ్చింది. చాలా కాలం తర్వాత సినిమా థియేటర్లో భారీగా జనాలు, వేడుకలను చూశా.. ఈ అఖండ విజయం సినిమా ఇండస్ట్రీది. అని బోయపాటి అన్నారు.