Balayya: డిసెంబరు చివరి వారంతో పాటు, వచ్చే ఏడాది జనవరిలో పోటీగా నిలిచేందుకు పలు హీరోల భారీ చిత్రాలు రెడీగా ఉన్నాయి. అందులో నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన అఖండ కూడా ఒకటి. డిసెంబరు 2న విడుదలకు సిద్ధమైన ఈ సినిమా.. ప్రమోషన్స్‌లో భాగంగా నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను జరుపుకుంది. శిల్పకలా వేదికలో ఈ కార్యక్రమం నిర్వహించారు. కాగా , ఈ వేడుకకు ముఖ్య అతిథిగా స్టైలిస్ట్ స్టార్ అల్లు అర్జున్ వచ్చారు.

ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ.. నందమూరి ఫ్యామిలీతో తమ ఫ్యామిలికి ఉన్న సంబంధం గురుంచి వివరంచారు. దీంతో పాటు సినిమా ఇండస్ట్రీలో కరోనో తర్వాత నెలకొన్న పరిస్థితుల గురించీ మాట్లాడారు. బాలయ్య సినిమా అఖండ ఘన విజయం సాధించి.. ఆ జ్యోతి అన్ని సినిమాలకు వెలగాలని అన్నారు. చివరకు జై బాలయ్య అంటూ స్పీచ్ ముగించారు. ఆ తర్వాత బాలయ్య బాబు మాట్లాడుతూ.. వచ్చే ఏడాది పోటీలో దిగనున్న బడా సినిమాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
తమ్ముడు అల్లు అర్జున్ పుష్ప, రాజమౌళి చరణ్, ఎన్టీఆర్‌ల ఆర్ఆర్ఆర్, చిరంజీవి ఆచార్య సినిమాలు రాబోతున్నాయి. ఈ సినిమాలన్నీ పెద్ద ఘన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు బాలయ్య. ఈ క్రమంలోనే రాజమౌళిపై ప్రశంసలు కురిపించారు. ఆయన దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాప్ డైరెక్టర్లలో ఒకరని అన్నారు. మరోవైపు సినిమా ఇండస్ట్రీలో కరోనా తర్వాత నెలకొన్న పరిస్థితులపైనా అఖండ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు బాలయ్య. రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు సినిమా ఇండస్ట్రీకి సహకరించాలని కోరారు.