Balayya Sensational Comments On F3: విక్టరీ వెంకటేష్ – వరుణ్ తేజ్ కాంబినేషన్ లో ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన హిలేరియస్ కామెడీ ఎంటర్టైనర్ F3 ఇటీవలే ప్రేక్షకుల ముందుకి వచ్చి భారీ విజయం అందుకున్న సంగతి మన అందరికి తెలిసిందే..2019 వ సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల అయ్యి సెన్సషనల్ హిట్ గా నిలిచినా F2 సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కిన ఈ మూవీ అంచనాలకు మించి ఓపెనింగ్స్ ని దక్కించుకొని, హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో ముందుకు దూసుకుపోతుంది..ఈ సినిమాకి ఫామిలీ ఆడియన్స్ క్యూ కట్టడం చూస్తూ ఉంటె..60 ఏళ్ళు వయస్సు వచ్చిన కూడా విక్టరీ వెంకటేష్ కి ఫామిలీ ఆడియన్స్ లో క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు అని అర్థం అవుతుంది..వీకెండ్స్ లో మాత్రమే కాకుండా పని దినాలలో కూడా ఈ సినిమా డీసెంట్ వసూళ్లను రాబడుతూ లాంగ్ రన్ వెంకటేష్ కి ఉన్న స్టామినా ఏమిటో మరోసారి అందరికి అర్థం అయ్యేలా చేసింది..మొదటి రోజు 12 కోట్ల రూపాయిల షేర్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా.మొదటి వీకెండ్ లో ఏకంగా 32 కోట్ల రూపాయిల షేర్ మార్కుని దాటి, ఇప్పుడు 40 కోట్ల రూపాయిల క్లిబ్ కి చేరుకుంది..ఈ సినిమాకి ప్రీ రిలీజ్ బిజినెస్ 60 కోట్ల రూపాయలకు జరగగా..బ్రేక్ ఈవెన్ మార్కు కోసం మరో 20 కోట్ల రూపాయిల షేర్ వసూలు చెయ్యాల్సి ఉంది.

ఇది ఇలా ఉండగా ఈ సినిమాని ఇటీవలే నందమూరి బాలకృష్ణ ప్రత్యేకమైన స్క్రీనింగ్ ద్వారా చూశాడట..ఈ సినిమాని చూసి ఆయన డైరెక్టర్ అనిల్ రావిపూడి ని పొగడతలతో ముంచి ఎత్తారు అట..నేను ఒక్క సినిమాని చూసి మనస్ఫూర్తిగా నవ్వుకొని చాలా కాలం అయ్యింది..F3 తో నన్ను అలా నవ్వించేలా చేసినందుకు అనిల్ రవి పూడి కి థాంక్స్..మిత్రుడు వెంకటేష్ ఎప్పటిలాగానే తన కామెడీ టైమింగ్ తో కడుపుబ్బా నవ్వించాడు..వరుణ్ తేజ్ లో కూడా ఇంత కామెడీ టైమింగ్ ఉంటుంది అని నేను అనుకోలేదు..ఈ సినిమా ఘానా విజయం సాధించినందుకు చిత్రం లో పని చేసిన ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను..ఇలాంటి సినిమాలు అనిల్ రావిపూడి ఇంకా తియ్యాలి అంటూ వ్యాఖ్యానించారు బాలయ్య బాబు..ఇది ఇలా ఉండగా అనిల్ రావిపూడి త్వరలోనే బాలయ్య బాబు తో ఒక్క సినిమా చెయ్యబోతున్న సంగతి మన అందరికి తెలిసిందే..ఈ సినిమాలో ప్రియమణి మరియు పెళ్ళిసందడి సినిమా హీరోయిన్ శ్రీ లీల ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు..ఈ సినిమాలో శ్రీ లీల బాలయ్య కి కూతురు గా నటిస్తుంది..అనిల్ రావిపూడి ఈరి తన స్టైల్ లో కాకుండా, బాలయ్య స్టైల్ లోనే ఊర మాస్ గా ఈ సినిమాని తెరకెక్కించనున్నాడు అట..అఖండ సినిమా తో భారీ విజయం అందుకున్న బాలయ్య బాబు..తన విజయ పరంపర ని ఈ సినిమా తో కొనసాగిస్తాడో లేదో చూడాలి.

Also Read: CM KCR- Telangana Formation Day: ఓవైపు డబ్బుల కటకట.. మరోవైపు కేసీఆర్ పొగడ్తల వర్షం
Recomended Videos