https://oktelugu.com/

పవన్ గురించి  ఆ రహస్యం చెప్పిన బాలయ్య..

సేవా నిరతి అమ్మకొచ్చిన రోగాన్ని ఏ అమ్మకు రాకుండా చేయాలని టాలీవుడ్ అగ్ర హీరో నందమూరి బాలయ్య ‘బసవతారకం క్యాన్సర్’ ఆస్పత్రిని నిర్మించాడు. ఇక్కడ క్యాన్సర్ రోగులకు ఉచితంగా వైద్యం అందిస్తుంటారు. అయితే దానికి ఎంతో వ్యయం అవుతున్నా బాలయ్య తన సినిమాలతోనూ.. ఇతరులు ఇచ్చిన విరాళాలతోనూ  ఆస్పత్రిని దిగ్విజయంగా నడిపిస్తున్నారు. కరోనా కరువు కాలంలోనూ బాలయ్య కు చాలా మంది అండగా నిలిచారు. కరోనా కాలంలో బాలకృష్ణకు చెందిన బసవతారకం ఆసుపత్రికి అనేక విధాలుగా విరాళాలు […]

Written By:
  • NARESH
  • , Updated On : June 24, 2021 / 06:00 PM IST
    Follow us on

    సేవా నిరతి అమ్మకొచ్చిన రోగాన్ని ఏ అమ్మకు రాకుండా చేయాలని టాలీవుడ్ అగ్ర హీరో నందమూరి బాలయ్య ‘బసవతారకం క్యాన్సర్’ ఆస్పత్రిని నిర్మించాడు. ఇక్కడ క్యాన్సర్ రోగులకు ఉచితంగా వైద్యం అందిస్తుంటారు. అయితే దానికి ఎంతో వ్యయం అవుతున్నా బాలయ్య తన సినిమాలతోనూ.. ఇతరులు ఇచ్చిన విరాళాలతోనూ  ఆస్పత్రిని దిగ్విజయంగా నడిపిస్తున్నారు.

    కరోనా కరువు కాలంలోనూ బాలయ్య కు చాలా మంది అండగా నిలిచారు. కరోనా కాలంలో బాలకృష్ణకు చెందిన బసవతారకం ఆసుపత్రికి అనేక విధాలుగా విరాళాలు రావడం విశేషం. ఇందులో మెగాస్టార్ చిరంజీవి, పవన్ కల్యాన్ తదితరులు విరాళం ఇచ్చారని స్వయంగా బాలయ్య తాజాగా గుర్తు చేశారు. తోటికళాకారుడిని అయిన నా మీద నమ్మకంతో ఇంత డబ్బు ఇచ్చిన ప్రతీ ఒక్కరికి థ్యాంక్స్ అని బాలకృష్ణ స్వయంగా పవన్, చిరు సాయాన్ని గుర్తు చేశారు.

    టాలీవుడ్ ఇండస్ట్రీలో పవన్ కల్యాణ్ ఇప్పటివరకు ఎందరికో సాయం చేశాడు. కానీ ఏ సాయాన్ని తాను చేసినట్టుగా చెప్పుకోడు. కేవలం ప్రభుత్వాలకు చేసిన సాయాలను మాత్రమే ప్రకటనలో పేర్కొంటాడు. పవన్ సినిమాలకు కోట్లు కురుస్తాయి. సినిమా కథ ఎలా ఉన్నా పవన్ నటనను నమ్ముకొనే సినీ జనాలు థియేటర్లోకి వస్తుంటారు. చాలా రోజుల తరువాత ఆయన నటించిన ‘వకీల్ సాబ్’ ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఎంతటి ప్రభంజనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. అయితే పవన్ కల్యాణ్ సినిమాల్లో నటించడమే కాకుండా తోటి నటుల కష్టాల్లో కూడా పాలుపంచుకుంటాడని తాజాగా బాలయ్య చేసిన ప్రకటనతో తేలింది.

    బాలయ్య టీడీపీలో ఉన్నా.. ఆయనతో అభిప్రాయభేదాలున్నా ఆయన ఆధర్యంలోని క్యాన్సర్ ఆస్పత్రికి పవన్ సహాయం చేయడం గొప్ప విషయంగా చెప్పొచ్చు.  ఇక పవన్ కల్యాణ్ సాయం గురించి ఇండస్ట్రీలో ఇప్పటికే కథలు కథలుగా చెబుతుంటారు. ఎంతో మందికి పవన్ దానకర్ణుడిగా నిలిచాడంటారు. హుద్ హుద్ తుఫాను సమయంలో ఆయన తన అకౌంట్లో రూ.55 లక్షలు ఉంటే 50 లక్షలు సాయం చేసిన వ్యక్తిగా నిలిచారు. అలాగే మొన్నటి కరోనా సమయంలో పవన్ తన వంతు రూ.2 కోట్లు ప్రకటించారు. ఇక సెకండ్ వేవ్ లో ఆయన కరోనా బారిన పడ్డా ఇతరులకు సాయం చేయడం విశేషం..

    తాజాగా పవన్ చేసిన సాయం గురించి బాలకృష్ణ బయటపెట్టారు. పవన్ కల్యాన్ ప్రస్తుతం 4 చిత్రాలతో బిజీగా ఉన్నారు. హరిహర వీరమల్లు షూటింగ్ లో త్వరలో పాల్గొననున్నారు.  అయితే కరోనా కారణంగా సినిమా వాయిదా పడింది. జూలైలో రీ షూటింగ్ జరుపుకోనున్నట్లు తెలుస్తోంది.