https://oktelugu.com/

బాలయ్య కోసం వారణాసి ప్రయాణం !

కరోనా మహమ్మారి దేశవ్యాప్తంగా ఇంకా పెరుగుతూనే ఉన్నా.. మళ్ళీ షూటింగ్ లు మొదలుపెట్టడానికి మేకర్స్ సన్నహాలు చేసుకుంటున్నారు. అయితే ఇప్పటికే సీనియర్ హీరోలు ఈ సంవత్సరం చివరి వరకు అవుట్ డోర్ షెడ్యూల్స్ ను మరియు విదేశీ షెడ్యూల్‌ లను పూర్తిగా రద్దు చేసుకున్న విషయం తెలిసిందే. అయితే బాలయ్య – బోయపాటి సినిమాలో ఓ ముఖ్యమైన సీక్వెన్స్ ను తప్పనిసరిగా వారణాసి మరియు హిమాలయాలలో విస్తృతంగా షూట్ చేయాల్సి ఉంది. అఘోర పాత్రకు సంబధించిన ఆ […]

Written By:
  • admin
  • , Updated On : October 4, 2020 / 04:38 PM IST
    Follow us on


    కరోనా మహమ్మారి దేశవ్యాప్తంగా ఇంకా పెరుగుతూనే ఉన్నా.. మళ్ళీ షూటింగ్ లు మొదలుపెట్టడానికి మేకర్స్ సన్నహాలు చేసుకుంటున్నారు. అయితే ఇప్పటికే సీనియర్ హీరోలు ఈ సంవత్సరం చివరి వరకు అవుట్ డోర్ షెడ్యూల్స్ ను మరియు విదేశీ షెడ్యూల్‌ లను పూర్తిగా రద్దు చేసుకున్న విషయం తెలిసిందే. అయితే బాలయ్య – బోయపాటి సినిమాలో ఓ ముఖ్యమైన సీక్వెన్స్ ను తప్పనిసరిగా వారణాసి మరియు హిమాలయాలలో విస్తృతంగా షూట్ చేయాల్సి ఉంది. అఘోర పాత్రకు సంబధించిన ఆ సీక్వెన్స్ లు కథకు చాలా కీలకమైనవి కావడంతో ఎట్టి పరిస్థితుల్లో అక్కడే షూట్ చేద్దాం అని దర్శకనిర్మాతల మీద ఒత్తిడి తెస్తున్నాడట బాలయ్య.

    Also Read: మిల్క్ బ్యూటీ తమన్నాకి కరోనా పాజిటివ్ ?

    ఎలాగూ స్టూడియోల్లో సెట్ వేయడం సాధ్యం అయ్యే పని కాదయ్యే, పోనీ స్క్రిప్ట్ లో నుండి అఘోర పాత్రకు సంబధించిన సీక్వెన్స్ లు తిసేద్దామా అంటే.. బాలయ్యకి ఆ సీక్వెన్స్ బాగా నచ్చిందని.. అది తీసేయడం కుదరని పని అని బోయపాటి ఫీల్ అవుతున్నాడట. మరి ఇప్పుడు బాలయ్య బృందం ఏమి చేస్తోందో.. ఏది ఏమైనా మొత్తానికి బాలయ్యకు నచ్చిన సీక్వెన్స్ కాబట్టి.. వారణాసి మరియు హిమాలయాలలోనే షూట్ చేయాలి. అందుకే ప్రస్తుతం బోయపాటి టీం వచ్చే వారం లోకేషన్స్ కోసం వారణాసి వెళ్లనుంది. అన్ని కుదిరితే నవంబర్ నుండి వారణాసిలోనే షూట్ స్టార్ట్ చేస్తారట. ఇక ఫుల్ ఫామ్ లో ఉన్న తమన్, మొదటిసారి బాలయ్య సినిమాకి మ్యూజిక్ ఇస్తుండటంతో మ్యూజిక్ పై సహజంగానే పాజిటివ్ ఫీడ్ బ్యాక్ ఉంటుంది.

    Also Read: రూట్ మార్చిన ఓటీటీ.. పే ఫర్ వ్యూ లెక్కన ప్రదర్శన?

    ఇక బాలయ్యకు ‘సింహ’ రూపంలో పెద్ద హిట్ ఇచ్చిన బోయపాటి ఆ తర్వాత దాన్ని మించి ‘లెజెండ్’ విజయాన్ని అందించాడు, కాకపోతే ఈ సారి ‘లెజెండ్’ను మించిన హిట్ పడాలంటే బోయపాటి రోటన్ యాక్షన్ కొట్టుడుకు దూరంగా ఉండాలి. ఏదైనా కొత్తగా చేయాలి. ఇదే విషయాన్ని బాలయ్య ఫ్యాన్స్ సోషల్ మీడియాలో బోయపాటికి తెగ రిక్వెస్ట్ చేస్తూ కామెంట్స్ పెడుతున్నారు. మరి బాలయ్యకు బోయపాటి హిట్ ఇస్తాడో.. లేక చేతులు ఏతేస్తాడో చూడాలి. ఇక ఈ సినిమాతో ఓ కొత్త హీరోయిన్ ను పరిచయం చేయబోతున్నారు. బడ్జెట్ సమస్య కావడంతో స్టార్ హీరోయిన్ని పెట్టుకున్నే స్తొమత లేకుండా పోయిందేమో పాపం.