Balayya Babu : నందమూరి నటసింహంగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న బాలయ్య బాబు…ప్రస్తుతం వరుస సినిమాలను చేస్తూ ఇండస్ట్రీలో తన కంటూ పెను ప్రభంజనాలను సృష్టిస్తూ ముందుకు సాగుతున్నాడు. ఇక ఇప్పటికే ఆయన వరుసగా నాలుగు విజయాలను అందుకున్నాడు. ఇప్పుడు బోయపాటి శ్రీను (Biyapati Srinu) డైరెక్షన్ లో రాబోతున్న అఖండ 2 (Akhanda 2) సినిమాతో భారీ సక్సెస్ ని సాధించడమే కాకుండా తన ఖాతాలో మరొక విజయాన్ని నమోదు చేసుకోబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పటిటి వరకు ఏ సీనియర్ హీరోకి కూడా వరుసగా నాలుగు విజయాలు దక్కలేదు. దాంతో ఆ రికార్డు ను సాధించిన సీనియర్ హీరోగా బాలయ్య బాబు(Balayya Babu) ఒక అరుదైన రికార్డును క్రియేట్ చేశారనే చెప్పాలి. ఇక తన మార్కెట్ కూడా ప్రస్తుతం 300 కోట్ల వరకు ఉండడంతో అతనితో సినిమాలు చేసే ప్రతి ఒక్క ప్రొడ్యూసర్ కూడా భారీ ఎత్తున సినిమాలను తీసి భారీ కలెక్షన్స్ కొల్లగొట్టాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది… ఇక బాలయ్య బాబు ఇప్పటివరకు తన కెరియర్లో 100కు పైన సినిమాల్లో నటించి మెప్పించడమే కాకుండా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తన మార్కును చూపిస్తూ ముందుకు సాగుతున్నాడు.
Also Read : బాలయ్య ఫ్యాన్స్ కి పండగే..’డాకు మహారాజ్’ ఓటీటీ వెర్షన్ లో 15 నిమిషాల సరికొత్త సన్నివేశాలు!
అయితే బాలయ్య బాబు కెరియర్ లో చేసిన సినిమాల్లో అతనికి కొన్ని సినిమాలు అంటే నచ్చవట. అందులో సింహం నవ్వింది ఒక్కటి కాగా, ఒక్క మగాడు, మిత్రుడు, మహారథి లాంటి సినిమాలు అతనికి నచ్చవట. ఆ సినిమాలను ఎందుకు చేశానా అని చాలాసార్లు బాలయ్య బాబు తన సన్నిహితుల దగ్గర బాధపడ్డట్టుగా తెలుస్తోంది.
మరి ఏది ఏమైనా కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో బాలయ్య బాబు వరుస సినిమాలతో సూపర్ సక్సెస్ లను సాధిస్తే ఆయన క్రేజ్ అనేది భారీ రేంజ్ లో పెరుగుతుంది. అలాగే సీనియర్ హీరోలెవ్వరికి సాధ్యం కానీ చాలా అరుదైన రికార్డులను కూడా ఆయన సొంతం చేసుకోవచ్చు.
మరి ఇలాంటి సందర్భంలో ఆయన ఎలాంటి సక్సెస్ లను సాధిస్తాడు తద్వారా ఆయనకంటూ ఎలాంటి గుర్తింపును సంపాదించుకోబోతున్నాడు అనేది తెలియాల్సి ఉంది… ఈ సినిమాలతో పాటుగా మరి కొంతమంది స్టార్ డైరెక్టర్లతో కూడా బాలయ్య బాబు సినిమాలు చేయడానికి కమిట్ అవుతున్నట్టుగా తెలుస్తోంది. మరి కొంత మంది బాలీవుడ్ దర్శకులు సైతం బాలయ్య బాబుతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తుండటం విశేషం.