Bhagavath Kesari : ‘అఖండ’ మరియు ‘వీరసింహా రెడ్డి’ లాంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్స్ తర్వాత నందమూరి బాలకృష్ణ ప్రముఖ డైరెక్టర్ అనిల్ రావిపూడి తో ఒక సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమాకి ‘భగవత్ కేసరి’ అనే టైటిల్ ని ఖారారు చేసి , కాసేపటి క్రితమే బాలయ్య లుక్ ని విడుదల చేసారు. ఈ టైటిల్ కి క్యాప్షన్ గా ‘ఐ డోంట్ కేర్’ అని ఉంటుంది.
ముందుగా ఈ సినిమా టైటిల్ ని ‘బ్రో – ఐ డోంట్ కేర్’ అనే టైటిల్ ని పెడుదాం అనుకున్నారు. ఆ తర్వాత అదే టైటిల్ ని పవన్ కళ్యాణ్ సినిమాకి ముందుగానే రిజిస్టర్ చేయించి ఉండడం తో, ‘భగవత్ కేసరి’ గా మార్చారు. ఈ సినిమాలో బాలయ్య బాబు తెలంగాణ స్లాంగ్ ని ఉపయోగించబోతున్నాడు. తెలంగాణ స్లాంగ్ లో ఇప్పటి వరకు బాలయ్య ఒక్క సినిమా కూడా చెయ్యలేదు, ఇది ఆయనకీ ఆయన ఫ్యాన్స్ కి ఎంతో కొత్తగా అనిపించొచ్చు.
ఈ సినిమా కథాంశం కూడా అనిల్ రావిపూడి గత చిత్రాలతో పోలిస్తే చాలా బిన్నంగా ఉంటుందట. కూతురు కోసం జైలు లో గడిపిన ఒక తండ్రిగా ఇందులో బాలయ్య బాబు కనిపించబోతున్నాడు అట, ఇందులో బాలయ్య కూతురుగా శ్రీలీల నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక బాలయ్య లుక్ ని చూస్తుంటే ‘మేస్త్రి’ సినిమాలో దాసరి నారాయణ రావు లుక్ ని పోలినట్టుగా అనిపిస్తుంది. ఇందులో అనిల్ రావిపూడి మార్క్ కామెడీ ఉండే అవకాశం తక్కువేనట. మొత్తం సెంటిమెంటల్ గా సినిమా సాగిపోతుందని సమాచారం.
హైదరాబాద్ లో శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ సినిమా, ఈ ఏడాదిలోనే షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని, దసరా కి ప్రేక్షకుల ముందుకు వచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. ఇక ఈ చిత్రం లో బాలయ్య బాబు కి జోడిగా కాజల్ అగర్వాల్ నటిస్తుంది, పెళ్లి తర్వాత ఆమె చేస్తున్న తెలుగు సినిమా ఇదే. ఈ సినిమా కి సంబంధించిన టీజర్ ని 10 వ తారీఖున బాలయ్య బాబు పుట్టినరోజు సందర్భంగా విడుదల చెయ్యబోతున్నారు.