Akhanda: టాలీవుడ్ లో ఓ చెడ్డ సాంప్రదాయం ఉంది. ఓ స్టార్ హీరో సినిమా వచ్చిందంటే చాలు టాక్ తో సంబంధం లేకుండా… కలెక్టన్స్ పోస్టర్స్ హల్చల్ చేస్తాయి. ప్లాప్ టాక్ తెచ్చుకున్న సినిమా కూడా కోట్ల వసూళ్లు రాబట్టినట్లు పోస్టర్స్ విడుదల చేస్తారు. ఇక ఏమాత్రం హిట్ టాక్ తెచ్చుకున్నా.. వాళ్ళను ఆపడం చాలా కష్టం. ఏరియాల వారీగా వాస్తవం తో సంబంధం లేకుండా భారీ ఫిగర్స్ తో కూడిన పోస్టర్స్ వెలుగులోకి వస్తాయి. ఓ పక్క మాకు పెట్టుబడి కూడా రాలేదు మొర్రో అని డిస్ట్రిబ్యూటర్స్ గగ్గోలు పెడుతుంటే, నిర్మాతలు మాత్రం మా సినిమా వసూళ్ల వర్షం కురిపిస్తుందని డప్పు కొట్టుకుంటూ ఉంటారు.
వాస్తవంగా ట్రేడ్ వర్గాలు చెబుతున్న లెక్కలకు, నిర్మాతల ప్రకటనలకు సంబంధం ఉండదు. ఈ ఫేక్ వసూళ్ల ప్రకటనలు చూసిన ఫ్యాన్స్ ఇతర హీరోలతో పోల్చుకుంటూ తాము గొప్పని చెప్పుకుంటూ ఉంటారు. రికార్డ్స్ కొట్టడంలో మా హీరో తర్వాతే అంటూ, యాంటీ ఫ్యాన్స్ ని ట్రోల్ చేస్తారు. లేని వసూళ్లను చూపించి, సినిమాపై హైప్ పెంచాలనేది నిర్మాతల ఆలోచన. ఆ విధంగా ప్రేక్షకుల్లో ఆసక్తిరేపి ఎంతో కొంత నష్టం తగ్గించుకోవాలనేది వాళ్ళ ప్లాన్. అదే సమయంలో సదరు స్టార్ హీరో పేరిట కొన్ని రికార్డ్స్ నెలకొల్పడం కూడా వారి లక్ష్యం కావచ్చు.
తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్స్ విషయంలో పారదర్శకత లేదు. నిజమైన వసూళ్లను తెలియజేసే వ్యవస్థ లేదు. దీంతో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ చెప్పే వసూళ్ల లెక్కలలో నిజం, నిజాయితీ లోపిస్తున్నాయి. 2020 సంక్రాంతి సీజన్ కి మహేష్ సరిలేరు నీకెవ్వరు, అల్లు అర్జున్ అల వైకుంఠపురం లో చిత్రాలు విడుదల కావడం జరిగింది. ఈ రెండు చిత్రాలు పాజిటివ్ టాక్ తెచ్చుకున్నాయి. దీంతో ఒకరికి మించి మరొకరు ఫేక్ కలెక్షన్స్ పోస్టర్స్ తో రెచ్చిపోయారు. ఈ రెండు చిత్రాల ఫేక్ కలెక్షన్స్ వార్ చూసిన జనాలు… హిట్ టాక్ తెచ్చుకొని కూడా ఇలాంటి చర్యల ద్వారా పరువు పోగొట్టుకున్నారని ఓపెన్ గా విమర్శించారు.
Balayya – Boyapati’s Hattrick Blockbuster #Akhanda grossed 102 crores in just 10 days with 61.5Cr share 🔥#AkhandaMassJathara is Unstoppable In 2nd week too 💥 #100CrBlockbusterAkhanda#NandamuriBalakrishna #BoyapatiSreenu @ItsMePragya @MusicThaman @dwarakacreation pic.twitter.com/8y6b3gRviL
— BA Raju’s Team (@baraju_SuperHit) December 12, 2021
కాగా బాలయ్య ఈ విషయంలో ఆదర్శంగా నిలిచారు. అఖండ మూవీ విషయంలో ఆయన చాలా జెన్యూన్ గా వ్యవహరిస్తున్నారని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అఖండ వసూళ్ల లెక్కలు వాస్తవానికి చాలా దగ్గరగా ఉన్నాయని, రికార్డుల కోసం ఫేక్ వసూళ్ల లెక్కలు చెప్పడం లేదంటున్నారు. పది రోజులకు గాను అఖండ వరల్డ్ వైడ్ గా రూ. 100 కోట్ల వసూళ్లు సాధించినట్లు నిర్మాతలు పోస్టర్స్ విడుదల చేశారు.
ఏరియాల వారీగా డిస్ట్రిబ్యూటర్స్ వెల్లడిస్తున్న లెక్కలకు ఇది చాలా దగ్గరగా ఉంది. అఖండ మూవీ కలెక్షన్స్ విషయంలో నిర్మాతలు చాలా జెన్యూన్ గా వ్యవరిస్తున్నారని, ప్రశంసిస్తున్నారు.