నటసింహం బాలయ్య బాబు – యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కలిసి చేస్తోన్న రోటీన్ యాక్షన్ కొట్టుడు సినిమా ‘అఖండ’ కొత్త షెడ్యూల్ తమిళనాడులో స్టార్ట్ చేశారు. తమిళనాడులోని ఓ దేవాలయంలో ఈ సినిమా క్లైమాక్స్ ఫైట్ సీన్ ను షూట్ చేస్తున్నారు. ఈ సీన్స్ లో బాలకృష్ణతో పాటు ప్రగ్యా అలాగే ఇతర ప్రధాన తారాగణం అంతా పాల్గొన్నారు.
ఇక ఈ యాక్షన్ సీన్స్ ను ఫేమస్ యాక్షన్ కొరియోగ్రాఫర్ స్టంట్ శివ డిజైన్ చేస్తున్నాడు. సినిమాలోనే ఈ యాక్షన్ సీక్వెన్స్ ప్రధాన హైలైట్ గా నిలవనుందని తెలుస్తోంది. ఇక ఇప్పటికే బాలయ్య – బోయపాటి కలయికలో సింహా, లెజెండ్ లాంటి బారీ హిట్స్ రావడం, ఇప్పుడు ముచ్చటగా హ్యాట్రిక్ కోసం వీరిద్దరూ కలిసి మరో ప్రయత్నం చేస్తుండటంతో….
మొదటి నుండి ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. పైగా బాలయ్య అభిమానూలు చాల సంవత్సరాల తరువాత తల ఎత్తుకుని సగర్వంగా తమ అభిమాన హీరో సినిమా గురించి మాట్లాడుకునేలా చేసింది ఈ సినిమా టీజర్. 60 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి అఖండ టీజర్ సృష్టిస్తోన్న సంచలనాల గురించి తెలిసిందే.
ఒక విధంగా వ్యూస్ పరంగా యూట్యూబ్ లో కొత్త రికార్డ్స్ ను సృష్టిచింది ఈ సినిమా టీజర్. అందుకే, శాటిలైట్ డీల్ కూడా ఎప్పుడో కుదిరింది ఈ సినిమాకు. బ్లాక్ బస్టర్ కాంబినేషన్ కావడం, సినిమాకి మంచి క్రేజ్ ఉండటంతో డీల్ వెంటనే క్లోజ్ అయింది. థియేటర్స్ రైట్స్ కు కూడా బాగా డిమాండ్ ఉంది.