Balakrishna: నట సింహం గా పేరు పొందిన బాలయ్య బాబు ఒక సినిమా చేస్తున్నాడు అంటే ఆ సినిమా మీద ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు ఉంటాయి. ఎందుకంటే ఆయన చేసే సినిమాలు మాస్ ఆడియన్స్ ని ఎక్కువగా ఆకట్టుకుంటూ ఉంటాయి. కాబట్టి మాస్ లో తనకున్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఆయన మొదటి నుంచి కూడా మాస్ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తూ సినిమాలు చేసుకుంటూ వస్తున్నాడు.
మధ్యలో కొన్ని క్లాస్ , మాస్ ఆడియన్స్ ని మెప్పించే సినిమాలు చేసినప్పటికి, ఇప్పుడు మాత్రం ఆయన ఎక్కువగా మాస్ ఆడియెన్స్ ను మెప్పించే సినిమాలు మాత్రమే చేసుకుంటూ వస్తున్నాడు. ఇక ఈ క్రమంలోనే బోయపాటి శ్రీను లాంటి స్టార్ డైరెక్టర్ తో ఆయన ఎక్కువగా సినిమాలు చేస్తూ హిట్లను అందుకుంటున్నాడు. ఇక అందులో భాగంగానే బాలయ్య బోయపాటి కాంబినేషన్ లో మరొక సినిమా వస్తుంది అంటూ చాలా రోజులుగా వార్తలైతే వస్తున్నాయి. కానీ ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం బోయపాటి శ్రీను, అల్లు అర్జున్ ని హీరోగా పెట్టీ ఒక సినిమా చేయబోతున్నాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక దాంతో బాలయ్య బోయపాటి మీద కొంచెం సీరియస్ గా ఉన్నట్టుగా తెలుస్తుంది.
ఎందుకంటే బాలయ్య తో ఒక సినిమా చేస్తానని కమిట్ అయిన బోయపాటి మళ్ళీ అల్లు అర్జున్ తో సినిమా చేయడం ఏంటి అంటూ బాలయ్య బాబు అయితే కోపంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే బాలయ్య తో సినిమా చేసిన తర్వాత బోయపాటి అల్లు అర్జున్ తో సినిమా చేస్తాడా? లేదంటే అల్లుఅర్జున్ తో సినిమా చేసిన తర్వాత బాలయ్య తో సినిమా చేస్తాడా.? అనేది తెలియాల్సి ఉంది. ఇక బాబీ సినిమా తర్వాత బాలయ్య బోయపాటి తో చేసే సినిమా కోసమే రెడీ అవుతున్నాడు.
మరి ఈ గ్యాప్ లో బోయపాటి ఏం చేస్తాడు. బాలయ్యని కాదని అల్లు అర్జున్ తో సినిమా చేస్తే మాత్రం బాలయ్య బాబు ఆగ్రహానికి గురవ్వక తప్పదు అనేది మరి కొంత మంది వాదన, మరి ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో బోయపాటి.ఏం చేస్తాడో తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…