Balakrishna And Srikanth: నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) లోని కోపాన్ని చూసి మనమంతా ఆయనకు చాలా యాటిట్యూడ్ అని అనుకుంటూ ఉంటాము. కానీ బాలయ్య మంచితనాన్ని దగ్గర నుండి చూసిన వాళ్ళు మాత్రం, ఆయన ఒక దేవుడు అని అంటుంటారు. ఆయనతో పని చేసే డైరెక్టర్స్ మళ్లీ మళ్లీ రిపీట్ గా పని చేస్తున్నారంటే, బాలయ్య వాళ్ళతో ప్రవర్తించే తీరు ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. బయటకు మనకు కనిపించే బాలయ్య వేరే,నిజమైన బాలయ్య వేరే. ఇది ‘అన్ స్టాపబుల్ విత్ NBK’ ప్రోగ్రాం ద్వారా అందరికీ ఒక క్లారిటీ వచ్చింది. అయితే బాలయ్య గురించి ఎవరికీ తెలియని ఒక ఆసక్తికరమైన సంఘటన సోషల్ మీడియా లో లీకై బాగా వైరల్ అయ్యింది. బాలయ్య ఇంత గొప్పవాడా అని ఈ సంఘటన గురించి తెలుసుకున్న ప్రతీ ఒక్కరు కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ ఆ సంఘటన ఏంటో వివరంగా చూద్దాం.
పూర్తి వివరాల్లోకి వెళ్తే, బాలయ్య సినిమాల్లోకి పూర్తిగా ఎంట్రీ ఇవ్వకముందు, తన తండ్రి ఎన్టీఆర్ మూవీ షూటింగ్స్ కి రెగ్యులర్ గా వెళ్తుండేవాడు. సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత కూడా ఆయనకు ఈ అలవాటు పోలేదు. అలా ఆయన ఎన్టీఆర్ చివరి చిత్రం అయినటువంటి ‘శ్రీనాధ కవి సార్వభౌముడు’ షూటింగ్ కి వెళ్ళేవాడు. ఈ షూటింగ్ రామకృష్ణ స్టూడియోస్ లో జరుగుతుంది. సాయంత్రం సమయం లో షూటింగ్ ని వీక్షించడానికి వెళ్లిన బాలయ్య కి, పక్కనే మరో సెట్ లో శ్రీకాంత్, ఇంద్రజ కాంబినేషన్ లో ‘జంతర్ మంతర్’ మూవీ షూటింగ్ జరుగుతూ ఉంది. అలా మూవీ సెట్స్ చూస్తూ వెళ్తున్న బాలయ్య కి ఒక కుర్రాడు లైట్ పట్టుకొని ఎండలో నిల్చుకోవడం గమనించాడు. వెంటనే కారు దిగి, ఆ కుర్రాడి వద్దకు వచ్చి, ఆ లైట్ ని పట్టుకున్నాడు బాలయ్య. షాట్ పూర్తి అయ్యే వరకు ఒక లైట్ మ్యాన్ లాగా, ఆ లైట్ ని అలా పట్టుకొని ఒక పక్కన కూర్చున్నాడు.
ఈ విషయాన్ని గమనించిన ఆ చిత్ర దర్శకుడు భరత్ పరిగెత్తుకుంటూ బాలయ్య వద్దకు వచ్చాడు. అలా వచ్చిన భరత్ ని బాలయ్య బాగా మందలించాడట. చిన్న పిల్లలతో ఇలాంటి పనులు చేయిస్తావా?, బుధ్హి ఉందా నీకు అసలు అంటూ తిట్టాడట. అనంతరం ఆ పిల్లాడి వివరాలు తెలుసుకున్న బాలయ్య, అతని తండ్రికి పక్షవాతం అని తెలుసుకొని, స్వయంగా ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో చేర్పించి, తన సొంత ఖర్చులతో చికిత్స చేయించాడు. అదే విధంగా కుర్రాడి చదువు బాధ్యతలను కూడా బాలయ్య నే తీసుకున్నాడు. అలా బాలయ్య సహాయం తో చదువుకున్న ఆ కుర్రాడు పెద్దయ్యాక పోలీస్ ఉద్యోగాన్ని సంపాదించాడు. ప్రస్తుతం అతను బెంగాల్ లోని బంకూరా జిల్లాలో సర్కులర్ ఇన్స్ పెక్టర్ గా పని చేస్తున్నాడు.ఇప్పటికీ ఆయన బాలయ్య పుట్టిన రోజు అయినటివంటి జూన్ 10న తనకు దగ్గర్లో ఉన్న హాస్పిటల్ కి వెళ్లి రక్త దానం వంటివి చేస్తుంటాడట. ఈ ఘటన గురించి ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ బుర్రా నరసింహ ఫేస్ బుక్ లో చెప్పుకొచ్చారు.