Balakrishna: నందమూరి నటసింహం బాలయ్య బాబు హీరోగా చేసిన చాలా సినిమాలు ఆయన్ని టాప్ హీరోగా నిలబెట్టాయి. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇప్పుడు చేస్తున్న సినిమాలతో మరింత ముందుకు దూసుకెళ్లే ప్రయత్నమైతే చేస్తున్నాడు. తనదైన రీతిలో సత్తా చాటుకుంటున్న బాలయ్య ఈ మధ్యకాలంలో భారీ విజయాలను రాబట్టడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు దూసుకెళ్తుండటం విశేషం. అయితే బాలయ్య బాబు హీరోగా చేసిన సినిమాల్లో ఇద్దరు సీనియర్ హీరోలు విలన్స్ గా నటించాల్సింది. కానీ ఆ ఇద్దరు స్టార్ హీరోలు సైతం అతని సినిమాలో విలన్స్ గా నటించలేకపోయారు. కారణం ఏదైనా కూడా తన నుంచి వచ్చే సినిమాల విషయంలో బాలయ్య చాలా క్లారిటిని మెయింటెన్ చేస్తున్నాడు. అందుకే ఈ మధ్యకాలంలో అతనికి వరుసగా సక్సెసులైతే దక్కుతున్నాయి. ఇప్పటికి నాలుగు విజయాలను తన ఖాతాలో వేసుకున్న బాలయ్య ‘అఖండ 2’ సినిమాతో మరో విజయాన్ని సాధిస్తాడని అందరు అనుకున్నప్పటికి అది అనుకున్న మేరకు సక్సెస్ ను సాధించకపోవడంతో ఆయన కొంతవరకు డీలా పడ్డాడు… ఇప్పటివరకు బాలయ్యను డామినేట్ చేయాలని చాలామంది హీరోలు అనుకున్నప్పటికి ఆయన మాత్రం కొత్త పంథాలో ప్రేక్షకులను అలరిస్తూ ఎప్పటికప్పుడు కొత్త అభిమానులను సంపాదించుకుంటున్నాడు.
ఇక బాలయ్య ఇప్పటికి తన సత్తా చాటుకుంటూ ఒక వినూత్న పద్ధతిలో అభిమానులను మెప్పిస్తూ ముందుకు దూసుకెళ్తుండటం విశేషం…ఇక ఇంతకీ బాలయ్య సినిమాలో విలన్ పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోలు ఎవరు అంటే ఒకరు రాజశేఖర్ కాగా, మరొకరు వడ్డే నవీన్ కావడం విశేషం…
వీళ్ళిద్దరు బాలయ్య బాబు చేసిన రెండు సినిమాల్లో విలన్ గా నటించాల్సింది. రాజశేఖర్, బాలయ్య బాబు హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన ‘వీర సింహ రెడ్డి’ సినిమాలో రాజశేఖర్ విలన్ గా నటించడానికి మొదట్లో గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. కానీ ఆ తర్వాత మాత్రం ఆయన ఆ క్యారెక్టర్ లో నటించలేకపోయాడు.
బాలయ్య బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ‘భగవత్ కేసరి’ సినిమాలో వడ్డే నవీన్ ఒక విలన్ పాత్రను పోషించాల్సి ఉంది. కానీ అనుకోని కారణాల వల్ల తను ఆ విలను పాత్రను పోషించలేకపోయాడు… మరి రాబోయే రోజుల్లో ఈ ఇద్దరు సీనియర్ హీరోలు బాలయ్య బాబుకు విలన్ గా నటించే అవకాశం దక్కుతుందా లేదా అనేది తెలియాల్సి ఉంది…
