Balakrishna-Vijay : తమిళ హీరో విజయ్(Thalapathy Vijay) చివరి చిత్రంగా ‘జన నాయగన్'(Jana Nayagan) తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన విజయ్, ఈ సినిమా తో తన సినీ కెరీర్ కి గుడ్ బాయ్ చెప్పనున్నాడు. వచ్చే సంవత్సరం లో తమిళనాడు లో జరిగే సార్వత్రిక ఎన్నికలలో ఆయన స్థాపించిన TVK పార్టీ పోటీ చేయనుంది. సరిగ్గా ఎన్నికలకు మూడు నెలల ముందు, అంటే సంక్రాంతికి ‘జన నాయగన్’ చిత్రం థియేటర్స్ లో విడుదల కానుంది. అయితే ఈ చిత్రం మన తెలుగు లో సూపర్ హిట్ గా నిల్చిన ‘భగవంత్ కేసరి’ చిత్రానికి రీమేక్ అనే ప్రచారం ఏ రేంజ్ లో జరిగిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ కాలం లో రీమేక్ సినిమాలేంటో అని సోషల్ మీడియా లో అభిమానులు అసంతృప్తి కి గురయ్యారు. కానీ నేడు ఈ చిత్రం గురించి సోషల్ మీడియా లో ప్రచారం అవుతున్న లేటెస్ట్ వార్త అభిమానులకు కొత్త ఊపిరిని అందించినట్టు అయ్యింది.
Also Read : బాలకృష్ణ కు తల్లిగా..ప్రభాస్ కి హీరోయిన్ గా నటించిన ఏకైక నటి ఆమేనా?
వివరాల్లోకి వెళ్తే ‘భగవంత్ కేసరి’ చిత్రం లో ‘గుడ్ టచ్..బ్యాడ్ టచ్’ అనే అంశం పై తన కూతురుకి బాలయ్య బాబు(Nandamuri Balakrishna) అవగాహన కల్పించే ఒక సన్నివేశం ఉంటుంది. కేవలం ఈ ఒక్క సన్నివేశాన్ని మాత్రమే ‘జన నాయగన్’ లో రీ క్రియేట్ చేస్తున్నారట. అందుకోసం ఏకంగా నాలుగు కోట్ల రూపాయిలిచ్చి రీమేక్ రైట్స్ ని కొనుగోలు చేసినట్టు తెలుస్తుంది. కానీ రీమేక్ సినిమా అంటే ఈమధ్య కాలం లో జనాలు థియేటర్స్ కి వెళ్లి చూడడం లేదు కాబట్టి, ఆ ప్రచారానికి అడ్డు కట్ట వేయడం కోసం కావాలని ఈ ప్రచారాన్ని తీసుకొచ్చారని, కచ్చితంగా ఈ చిత్రం ‘భగవంత్ కేసరి’ కి పూర్తి స్థాయి రీమేక్ అని మరికొంతమంది అంటున్నారు. ఎందుకంటే ఈ సినిమా ఫ్లాష్ బ్యాక్ లో విజయ్ పై పోలీస్ డ్రెస్ లో కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియా లో లీక్ అయ్యాయి.
కేవలం అదొక్కటే కాదు, ఈ చిత్రం మమిత బైజు విజయ్ కి కూతురిగా నటిస్తుండగా, పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. సరిగ్గా భగవంత్ కేసరి చిత్రం లోని శ్రీలీల, కాజల్ అగర్వాల్ క్యారెక్టర్స్ ని వీళ్లిద్దరు చేస్తున్నట్టుగా అనిపిస్తుంది కదూ. ఇక తెలుగు లో అర్జున్ రాంపాల్ పోషించిన క్యారక్టర్ ని ‘జన నాయగన్’ లో బాబీ డియోల్ చేస్తున్నాడు. సినిమాని చూస్తుంటే కచ్చితంగా రీమేక్ లాగానే అనిపిస్తుంది. కానీ తమిళ నేటివిటీ కి తగ్గట్టు, విజయ్ స్టైల్ కి మార్చి ఈ చిత్రాన్ని తెరకెక్కించి ఉండొచ్చు. ఏది ఏమైనా టీజర్, లేదా థియేట్రికల్ ట్రైలర్ వచ్చే వరకు ఇది పూర్తి స్థాయి రీమేకా?, లేకపోతే కేవలం ఒక్క సన్నివేశాన్ని మాత్రమే తీసుకున్నారా అనేది తెలుస్తుంది.