https://oktelugu.com/

Veera Simha Reddy TRP Rating: బుల్లితెర పై ‘వీర సింహా రెడ్డి’ వీరంగం..వచ్చిన TRP రేటింగ్స్ ఎంతో తెలుసా..!

BAARC విడుదల చేసిన రీసెంట్ TRP రేటింగ్స్ లిస్ట్ తీస్తే 'వీర సింహా రెడ్డి' సినిమాకి 8.80 రేటింగ్స్ వచ్చాయి. ఒక మాస్ చిత్రానికి ఈ రేంజ్ రేటింగ్స్ రావడం అనేది సాధారణమైన విషయం కాదు.

Written By:
  • Vicky
  • , Updated On : May 6, 2023 / 11:59 AM IST
    Follow us on

    Veera Simha Reddy TRP Rating: ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన నందమూరి బాలకృష్ణ ‘వీర సింహా రెడ్డి’ చిత్రం ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే.’అఖండ’ సినిమాతో భారీ హిట్ కొట్టి మంచి ఊపు మీదున్న బాలయ్య ఈ సినిమాతో మరో హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ చిత్రం తో పాటుగా విడుదలైన ‘వాల్తేరు వీరయ్య’ కంటే చాలా తక్కువ వసూళ్లు రాబట్టింది కానీ,బాలయ్య కెరీర్ లో హైయెస్ట్ గ్రాస్సర్ గా మాత్రం నిల్చింది.

    వంద రోజులను పూర్తి చేసుకుంది, ఇప్పుడు 175 రోజులు కూడా విజయవంతంగా పూర్తి చేసుకోబోతుంది.ఈ చిత్రాన్ని రీసెంట్ గానే స్టార్ మా ఛానల్ లో టెలికాస్ట్ చేసారు, రెస్పాన్స్ అదిరిపోయింది,బాలయ్య గత చిత్రం ‘లెజెండ్’ కి 14 కి పైగా TRP రేటింగ్స్ వచ్చాయి, ‘వీర సింహా రెడ్డి’ కి ఎంత వచ్చాయో ఒకసారి చూద్దాము.

    BAARC విడుదల చేసిన రీసెంట్ TRP రేటింగ్స్ లిస్ట్ తీస్తే ‘వీర సింహా రెడ్డి’ సినిమాకి 8.80 రేటింగ్స్ వచ్చాయి. ఒక మాస్ చిత్రానికి ఈ రేంజ్ రేటింగ్స్ రావడం అనేది సాధారణమైన విషయం కాదు. అందులోనూ బాలయ్య ఫ్యామిలీ ఆడియన్స్ కి దూరమై చాలా కాలం అయ్యింది, అలాంటిది ఆయనకీ ఇప్పుడు ఇంత మంచి రేటింగ్స్ రావడం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది.

    అందుకు కారణం ‘అఖండ’ సినిమానే, వరుస డిజాస్టర్ ఫ్లాప్ సినిమాల తర్వాత మార్కెట్ మొత్తం పోయింది అనుకుంటున్న సమయం లో బాలయ్యకి ‘అఖండ’ చిత్రం ఆ ఈశ్వరుడు ఇచ్చిన వరం లాంటిదని అభిమానులు భావిస్తారు. ప్రస్తుతం ఆయన అనిల్ రావిపూడి తో ఒక సినిమా చేస్తున్నాడు, ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ శరవేగంగా సాగుతుంది.ఈమధ్యనే ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ ని విడుదల చేసారు, దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది.