Balakrishna Birthday: నటసింహం బాలకృష్ణ జన్మదినం నేడు. ఆయన 65వ ఏట అడుగుపెట్టారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బాలకృష్ణ అభిమానులు బర్త్ డే వేడుకలు జరుపుకుంటున్నారు. సోషల్ మీడియా వేదికగా ప్రముఖులు, అభిమానులు జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నారు. ఎప్పటిలానే బాలకృష్ణ పుట్టినరోజు వేడుకలు బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో జరుపుకున్నారు. రోగులను పలకరించారు. వారికి పళ్ళు అందించారు. అనంతరం ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆసక్తికర కామెంట్స్ చేశారు.
65వ జన్మదినం చాలా ప్రత్యేకం అన్నారు. తాను నటించిన నాలుగు సినిమాలు వరుసగా విజయం సాధించాయి. పద్మభూషణ్ అవార్డు వరించింది అన్నారు. గతంలో నేను.. ఒకపై నేను ఏమిటో చూపిస్తాను అన్నాడు, ఈ మాటలకు వీడికి పొగరు అన్నారు. అవును నాకు పొగరే, దమ్మున్న నన్ను చూసుకుని నాకు పొగరే.. అని బాలయ్య అన్నారు. వీడికి అన్నీ తెలుసా అంటారు కొందరు. నన్ను నేను తెలుసుకోవడం కంటే తెలుసుకోవాల్సింది ఏముంది. మనిషికి కృషి, పట్టుదల, క్రమశిక్షణ అవసరం. అఖండ 2 కోసం జార్జియా దేశంలో -4 డిగ్రీల చలిలో స్లీవ్ లెస్ షర్ట్ లో నటించాను. నటుడిగా అది నా బాధ్యత… అని బాలయ్య అన్నారు.
బాలయ్య కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అఖండ వరకు బాలయ్య కెరీర్ దారుణంగా ఉంది. కనీసం పది కోట్ల గ్రాస్ రాబట్టలేని స్థితికి బాలయ్య మార్కెట్ పడిపోయింది. అఖండ తో బాలకృష్ణ హిట్ ట్రాక్ ఎక్కాడు. కలిసొచ్చిన డైరెక్టర్ బోయపాటి శ్రీను ఆయనకు కమ్ బ్యాక్ ఇచ్చాడు. అనంతరం బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ హిట్ స్టేటస్ రాబట్టాయి. ఈ ఏడాది భారత ప్రభుత్వం బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు ప్రకటించింది. బాలయ్యకు ఇది మొదటి పద్మ పురస్కారం కావడం విశేషం.
ఇక బాలయ్య జన్మదినం పురస్కరించుకుని అఖండ 2 టీజర్ విడుదల చేశారు. అలాగే రిలీజ్ డేట్ ప్రకటించారు. అఖండ 2 టీజర్ మెప్పించింది. ముఖ్యంగా అభిమానులు ఫిదా అవుతున్నారు. అఖండ 2 అనంతరం బాలయ్య దర్శకుడు గోపీచంద్ మలినేనితో మూవీ చేయనున్నాడు. మోక్షజ్ఞ డెబ్యూ మూవీ ఆదిత్య 999పై అప్డేట్ ఉంటుందని ఫ్యాన్స్ ఆశించారు. అయితే బాలయ్య బర్త్ డే వేళ మోక్షజ్ఞ ఎంట్రీ పై ప్రకటన లేనట్లు ఉంది.
నన్ను నేను చూసుకుని నాకు పొగరు.. : Balakrishna #Balakrishna #NandamuriBalakrishna #NTVNews #NTVTelugu pic.twitter.com/IbOH04wwpw
— NTV Telugu (@NtvTeluguLive) June 10, 2025