Jailer 2 Balayya seen Oora Mass : బాలయ్య బాబు (Balayya Babu) హీరోగా చేసిన చాలా సినిమాలు అతనికి మంచి గుర్తింపును సంపాదించి పెట్టాయి.ఆయన ఇండస్ట్రీ కి వచ్చి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడు. ఇక ప్రస్తుతం చేస్తున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తగా తీసుకుంటున్నాడు. ఇప్పటివరకు ఆయన సాధించిన విజయాలు అతన్ని గొప్ప స్థాయిలో నిలబెడితే, ఇకమీదట రాబోతున్న సినిమాల విషయంలో కూడా ఆయన చాలా వరకు సక్సెస్ లను సంపాదించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. నందమూరి తారక రామారావు గారి తనయుడిగా ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలిగిన ఆయన చాలా తొందరగా తనకంటూ ఒక సపరేట్ రూట్ కూడా వేసుకొని యువరత్న గా, లెజెండ్ గా బాలయ్య గొప్ప పేరు సంపాదించుకున్నాడు. ఇక బాలయ్య బాబు తన ఎంటైర్ కెరియర్ లో చేసిన సినిమాలన్నీ మాస్ సినిమాలే కావడం విశేషం. ఆయన వరుసగా నాలుగు విజయాలతో ప్రేక్షకుల మనసు దోచుకున్నాడు. యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులందరిని కట్టిపడేయాలనే ఉద్దేశ్యంతో ఉన్నట్టుగా తెలుస్తోంది. మాస్ సినిమాలను చేయడంలో బాలయ్య బాబును మించిన హీరో మరొకరు అయితే ఉండరు.
సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపును సంపాదించుకున్న రజినీకాంత్ తెలుగులో డబ్ చేసి ఇక్కడ కూడా మాస్ లో విపరీతమైన ఫాలోయింగ్ ను అయితే సంపాదించుకున్నాడు. తెలుగులో స్టార్ హీరో సినిమా రిలీజ్ అవుతుంది అంటే ఎంత బజ్ ఉంటుందో రజినీకాంత్ సినిమా రిలీజ్ అవుతుందన్న కూడా ఇక్కడ అంతే బజ్ క్రియేట్ అవుతుంది.
Also Read : రజినీకాంత్ ‘జైలర్ 2’ లో బాలయ్య సైకో పోలీస్ గా కనిపించబోతున్నాడా..?
ఇక రజనీకాంత్ కి బాలయ్య బాబుకి మంచి సన్నిహిత్యం అయితే ఉంది. అందువల్లే నెల్సన్ దర్శకత్వంలో చేసిన జైలర్ సినిమాలో బాలయ్య బాబు చేత గెస్ట్ అప్పిరియన్స్ ఇప్పించాలనే ప్రయత్నం చేశారు. కానీ అది ఎందుకో వర్కౌట్ కాలేదు ఇక ‘జైలర్ 2’ (Jailer 2) సినిమా కోసం బాలయ్య బాబును రంగంలోకి దింపినట్టుగా తెలుస్తోంది. పోలీస్ ఆఫీసర్ గా జైలర్ గా ఈ సినిమాలో కనిపించబోతున్నాడట. మరి బాలయ్య బాబు నార్మల్ గా ఉంటేనే రౌడీలను ఏరి పారేస్తాడు.
అటువంటిది మెంటల్ పోలీస్ గా ఉన్నాడంటే అవతల ఉండే రౌడీలకు దబిడి దిబిడే అని చాలామంది అభిమానులు వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నా. మరి మొత్తానికైతే బాలయ్య లాంటి హీరో యావత్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో మనకు ఎక్కడ కనిపించరు. అలాంటిది ‘జైలర్ 2’ (Jaier 2) సినిమాలో ఈ క్యామియో కనక పర్ఫెక్ట్ గా వర్కౌట్ అయితే ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ అవ్వడం పక్కా అలాగే బాలయ్య బాబుకి కూడా తమిళంలో మంచి మార్కెట్ అయితే ఏర్పడుతోంది…