Balakrishna Pawan Kalyan Movies: టాలీవుడ్ లో ఈసారి పెద్ద సినిమాలు తరచూ బాక్స్ ఆఫీస్ వద్ద క్లాష్ కి రావడం సర్వ సాధారణం అయిపోయింది. మరో ఆరు రోజుల్లో ఎన్టీఆర్(Junior NTR),హృతిక్ రోషన్(Hrithik Roshan) కాంబినేషన్ లో తెరకెక్కిన ‘వార్ 2′(War 2 Movie), సూపర్ స్టార్ రజనీకాంత్(Superstar Rajinikanth) ‘కూలీ'(Coolie Movie) చిత్రాలు విడుదల కాబోతున్నాయి. సరైన సక్సెస్ లేక అల్లాడుతున్న టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ఈ రెండు చిత్రాలపై భారీ ఆశలను పెట్టుకుంది. ఇది కాసేపు పక్కన పెడితే వచ్చే నెల 25 వ తారీఖున పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ‘ఓజీ'(They Call Him OG), బాలకృష్ణ(Nandamuri Balakrishna) ‘అఖండ 2′(Akhanda 2 Movie) చిత్రాలు కూడా విడుదలకు సిద్ధం గా ఉన్నాయి. అయితే ఈ రెండిట్లో ఎదో ఒక సినిమా వెనక్కి వెళ్తుందని అంతా అనుకున్నారు. ‘అఖండ 2’ డిసెంబర్ నెలకు వాయిదా పడింది అని సోషల్ మీడియా లో, ఇండస్ట్రీ సర్కిల్స్ లో పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరిగింది. కానీ మేకర్స్ మాత్రం సెప్టెంబర్ 25 న ఎట్టిపరిస్థితిలో వస్తాము అనే అంటున్నారు.
Also Read: వార్ 2 తెలుగు వెర్షన్ బుకింగ్స్ ఇలా ఉన్నాయేంటి?
కాసేపటి క్రితమే మేకర్స్ ‘అఖండ 2’ చిత్రానికి బాలయ్య డబ్బింగ్ పూర్తి చేశాడంటూ ఒక అప్డేట్ ని విడుదల చేసింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఫుల్ స్పీడ్ లో జరుగుతుందని, సెప్టెంబర్ 25 న వచేస్తున్నాం అంటూ చెప్పుకొచ్చారు. ఈ పోస్ట్ సోషల్ మీడియా లో పెద్ద దుమారమే రేపింది. అంటే పవన్ కళ్యాణ్ సినిమాకి ఎదురెళ్ళే ధైర్యం చేస్తున్నారా?, పైగా ఓజీ కి ఉన్న క్రేజ్ ని చూసి కూడా ఈ సాహసం చేస్తున్నారా అని పవన్ కళ్యాణ్ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. మరోపక్క బాలయ్య అభిమానులు కూడా మేము తగ్గేదేలే అంటున్నారు. ఇప్పటికే ఓజీ నుండి ‘ఫైర్ స్ట్రోమ్’ పాట విడుదలై సోషల్ మీడియా ని ఒక ఊపు ఊపేస్తోంది. ఎక్కడ చూసినా ఇప్పుడు ఈ పాట నే వినిపిస్తుంది. చాలా కాలం తర్వాత పవన్ కళ్యాణ్ కి ఒక బ్లాక్ బస్టర్ సాంగ్ పడిందని, ఇప్పటికే ఈ చిత్రం పై కనీవినీ ఎరుగని రేంజ్ అంచనాలు ఉన్నాయని, ఈ పాట తర్వాత ఆ అంచనాలు ఎవ్వరూ కలలో కూడా ఊహించని రేంజ్ కి వెళ్లిందని అంటున్నారు.
Also Read: ది ప్యారడైజ్’ నుండి నాని ఫస్ట్ లుక్ వచ్చేసింది..ఈ ‘జడల్’ ఏంటయ్యా బాబు!
ఈ నెల 15 న స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ‘ఓజీ’ నుండి టీజర్ విడుదల కాబోతుంది. దీనికి సంబంధించిన అప్డేట్ త్వరలోనే బయటకు రానుంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ రెండు చిత్రాలకు సంగీతం థమన్ అందిస్తున్నాడు. త్వరలోనే ‘అఖండ 2’ నుండి మొదటి పాటని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడట థమన్. మరోపక్క ఓజీ చిత్రానికి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వర్క్ లో కూడా బిజీ గా ఉన్నాడు. అయితే ఎవరెన్ని మాట్లాడుకున్నా సెప్టెంబర్ 25 న ఈ రెండు చిత్రాల్లో కేవలం ఒకటి మాత్రమే వస్తుంది అనేది వాస్తవం. ఆ ఒక్కటి ఓజీ చిత్రమే. రీసెంట్ ‘అఖండ 2’ నిర్మాతలతో ఓజీ మేకర్స్ చర్చలు జరిపారట. వాళ్ళు వాయిదా వేసుకుంటామని వెనక్కి వెళ్లిన తర్వాతనే ఓజీ కి సంబంధించి మొదటి లిరికల్ వీడియో సాంగ్ ని విడుదల చేశారట. వాయిదా వేసుకున్నప్పటికీ కూడా ఇలా సెప్టెంబర్ 25 న వస్తున్నాం అని చెప్పడానికి గల ముఖ్య కారణం ఓటీటీ డీల్ ని అత్యధిక రేట్ కి అడగడం కోసమే అని అంటున్నారు. ఒకేవేళ క్లాష్ అనివార్యం అనుకుంటే మాత్రం రెండు సినిమాలు మూడు వారాల వరకు థియేటర్స్ ని కళకళలాడిపోయేలా చేస్తాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు.