
నట సింహం నందమూరి బాలకృష్ణది చిన్న పిల్లల మనస్తత్వం అని ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరూ చెబుతారు. దానికి తగ్గట్లుగానే బాలయ్య బాబు కూడా ఎప్పటికప్పుడు తన చిన్న పిల్లాడి మనసును చాటుకుంటునే ఉంటారు. తాజాగా దర్శకులకి కూడా లేటెస్ట్ గా ఒక మెసేజ్ పాస్ చేశాడు బాలయ్య. ఇక పై తను చేయబోయే చిత్రాల్లో కొత్తదనం ఖచ్చితంగా ఉండాలని బాలయ్య దర్శకులకు క్లారిటీగా చెప్తూ.. తనకు కథ చెప్పాలనుకుంటే కొత్తదనం ఉండాలని, అప్పుడే కథ చెప్పడానికి రండని తనకు టచ్ లో ఉన్న డైరెక్టర్స్ కి బాలయ్య తన స్టైల్ లో ఆర్డర్స్ పాస్ చేశాడట.
చైనా కాచుకో.. భారత్ కు అమెరికా బలగాలు!
కానీ బాలయ్య ఆర్డర్స్ ను అందుకునే స్టార్ డైరెక్టర్ లు ఎవరు ఉన్నారన్నదే ఇక్కడ పెద్ద ప్రశ్న. అసలు స్టార్ డైరెక్టర్ లు బాలయ్య బాబు అంటేనే అడ్రస్ లేకుండా పోతారని కొంతమంది సినిమా మిత్రులు చెప్పే రెగ్యులర్ మాట. కారణం.. బాలయ్యను డీల్ చేయడం కత్తి మీద సాము లాంటిది అనేది వారి అభిప్రాయం. ఎవరు ఎన్ని చెప్పుకున్నా సరే.. బాలయ్య స్టార్ హీరో.. ఆయన పై వచ్చే రూమర్స్ నిజం కూడా కావొచ్చు.. కానీ బాలయ్యకి ఇప్పటికీ అభిమానులు ఉన్నారు.
తెలుగు రాష్ట్రాల్లో మరోసారి లాక్ డౌన్ తప్పదా?
కాకపోతే ఆ స్టార్ డమ్ ఇప్పుడు కూడా ఉందా అన్నదే అనుమానం. నిజంగా బాలయ్యకు మునపటి స్టార్ వాల్యూ ఉంటే.. ఇండస్ట్రీలోని స్టార్ డైరెక్టర్స్ అంతా బాలయ్యతో సినిమా చెయ్యడానికి తమ వంతు ప్రయత్నాలు తప్పకుండా చేసుకునేవారు కాదా… మరెందుకు ఒక్క బోయపాటి తప్ప.. మిగిలిన వాళ్ళు అంతా బాలయ్యకు దూరం జరిగారు. ఏ.. త్రివిక్రమ్ లాంటి దర్శకుడు బాలయ్యతో సినిమా చేస్తే.. బాలయ్య మీద వంద కోట్లు రావంటారా.. ఖచ్చితత్వంతో చెప్పొచ్చు. సినిమా హిట్ అయితే బాలయ్య మీద కలెక్షన్ల వర్షం కురిసే అవకాశం ఉందని. కానీ బాలయ్యతో స్టార్ డైరెక్టర్ లు సినిమాలు చెయ్యరు. ఎందుకో బాలయ్య ఆలోచించుకోవాలి.
ప్రస్తుతం బాలయ్య బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో ‘సింహ, లెజెండ్’ చిత్రాల మాదిరిగా మాస్ అండ్ యాంగ్రీ హీరోగానే కాకుండా ఇంకాస్త కొత్తగా కనిపించాలనేది బాలయ్య తాపత్రయం. అందుకే గుండు కూడా కొట్టించుకున్నాడు. మరి గుండుతో బాలయ్య కొత్తదనం ఎలా ఉంటుందో చూడాలి.