Balakrishna: తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి నటసింహం బాలయ్య బాబుకి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు అతన్ని టాప్ లెవల్ లో నిల్చోబెట్టాయి. తనదైన రీతిలో సత్తా చాటుకుంటున్న ఈ స్టార్ హీరో ప్రస్తుతం కమర్షియల్ సినిమాల వైపే అడుగులు వేస్తున్నాడు…ఇక ఇలాంటి క్రమంలోనే తన నుంచి వస్తున్న ప్రతి సినిమా విషయంలో చాలా క్లారిటిని మెయింటైన్ చేస్తున్న బాలయ్య ఇకమీదట చేయబోతున్న సినిమాల విషయంలో సైతం చాలా క్లారిటిగా ఉంటున్నాడు. ఇక తను చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశమైతే ఉంటుంది. బాలయ్య బాబుకి ఇండస్ట్రీలో ఉన్న అందరితో సన్నిహిత సంబంధాలు ఉన్నప్పటికి ఒక ఇద్దరు హీరోలతో మాత్రం అతను మాట్లాడటం లేదట. వాళ్ళంటే తనకు పడటం లేదనే వార్తలైతే వస్తున్నాయి. ఇంతకీ ఆ ఇద్దరు హీరోలు ఎవరు అంటే ఒకరు అక్కినేని నాగార్జున కాగ, మరొకరు జూనియర్ ఎన్టీఆర్ కావడం విశేషం… బాలయ్య గతంలో చాలా సన్నిహితంగా మెదిలాడు. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి ఎందుకో వారిని దూరం పెట్టినట్టుగా తెలుస్తుంది. అసలు వాళ్ళ పేరు చెబితేనే బాలయ్య కోపంతో రగిలిపోతున్నాడట.
కారణం ఏదైనా కూడా సినిమా ఇండస్ట్రీలో ఉన్నప్పుడు తోటి హీరోలందరితో చాలా సన్నిహిత్యంగా ఉంటే బాగుంటుంది. ఒకరికొకరు సినిమాలపరంగా హెల్ప్ చేసుకుంటే చూసే అభిమానులు కూడా తమ హీరోల మాదిరిగానే పాజిటివ్ గా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. అలా కాకుండా ఒకరి మీద ఒకరు దూషించుకుంటూ ఉంటే ఫ్యాన్స్ సైతం రెచ్చిపోయి మా హీరోనే గొప్ప అంటే మా హీరోనే గొప్ప అనే రేంజ్ లో నినాదాలు చేస్తారు.
అలాగే ఒకరితో ఒకరు ఫైటింగ్ చేసుకునే ప్రమాదం కూడా ఉంది…ఇక బాలయ్య ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో మరోసారి పెను ప్రభంజనాన్ని సృష్టించడానికి రెడీ అవుతున్నట్టుగా తెలుస్తుంది… వీలైనంత తొందరగా ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసి రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు…