https://oktelugu.com/

భయపడి బాలయ్య వెనక్కి తగ్గాడు

ప్రస్తుతం బాలయ్య బాబు పరిస్థితి పుండు మీద పుట్ర లా తయారయ్యింది .సినిమాల ఎంపిక లో ఒక పట్టాన నిర్ణయం తీసుకోలేక పోతున్నాడు. అసలే ఈ మధ్య విజయాలు దూరమౌతున్నాయి. చివరగా. విడుదలైన `రూలర్ `చిత్రం అయితే మరీ భయపెట్టింది. బాలయ్య కెరీర్ లోనే బాక్స్ ఆఫీస్ వద్ద అత్యంత తక్కువ వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలిచి పోయింది. . నందమూరి బాలకృష్ణ సినిమాల ఎంపిక చాలా చిత్రంగా ఉంటుంది. తనకు తోచిన రీతిలోముందుకు వెళ్తుంటాడు. కాంబినేషన్ […]

Written By: , Updated On : April 12, 2020 / 12:53 PM IST
Follow us on

ప్రస్తుతం బాలయ్య బాబు పరిస్థితి పుండు మీద పుట్ర లా తయారయ్యింది .సినిమాల ఎంపిక లో ఒక పట్టాన నిర్ణయం తీసుకోలేక పోతున్నాడు. అసలే ఈ మధ్య విజయాలు దూరమౌతున్నాయి. చివరగా. విడుదలైన `రూలర్ `చిత్రం అయితే మరీ భయపెట్టింది. బాలయ్య కెరీర్ లోనే బాక్స్ ఆఫీస్ వద్ద అత్యంత తక్కువ వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలిచి పోయింది. .

నందమూరి బాలకృష్ణ సినిమాల ఎంపిక చాలా చిత్రంగా ఉంటుంది. తనకు తోచిన రీతిలోముందుకు వెళ్తుంటాడు. కాంబినేషన్ గురించి ఎటువంటి శ్రద్ద తీసుకోడు..గత పది పదిహేనేళ్ల బాలయ్య కెరీర్‌ను తీసుకుంటే.. పి.వాసు, జయంత్.సి.పరాన్జీ, దాసరి నారాయణ రావు కె.ఎస్.రవికుమార్ లాంటి ఔట్ డేటెడ్ దర్శకులతో సినిమాలు చేశాడు.

బాలయ్యతో సినిమాలు చేసే సమయానికి వీళ్లెవ్వరూ సరైన ఫాంలో లేరు. అయినా సీనియర్ లన్న భావనతో వీళ్లతో సినిమా చేసాడు. ఇపుడు మళ్ళీ అదే రిపీట్ అవుతోంది. బి.గోపాల్ లాంటి మరో ఔట్ డేటెడ్ డైరెక్టర్‌తో బాలయ్య బాబు సినిమా చేయబోతున్నాడన్న వార్త బయటికి వచ్చింది. దానికి తోడు చిన్నికృష్ణ లాంటి మాస్ రైటర్ కథతో బాలయ్య ఈ సినిమా చేయబోతున్నట్లు వార్తలొచ్చాయి.

బి.గోపాల్, చిన్నికృష్ణ కాంబినేషన్ ఒకప్పుడు సూపర్ హిట్ కాంబో అందులో ఎటువంటి సందేహం అక్కర్లేదు. కానీ ఇపుడు ట్రెండ్ మారింది. కొత్త తరం కధలు రాజ్యమేలు తున్నాయి. ప్రేక్షకులు కూడా వినూత్న ప్రయోగాలకు పట్టం కడుతున్నారు అందుకే ముందు బి.గోపాల్ ప్రాజెక్టు పట్ల ఆసక్తితోనే ఉన్న బాలయ్య.. ఇప్పుడు ఆ ఆలోచనను విరమించుకున్నట్లు తెలుస్తోంది . అసలే కెరీర్ అంతంత మాత్రంగా వున్న ఈ కష్ట కాలంలో ఇలాంటి సినిమాను ఎందుకు చేయాలి అని పునరాలోచించుకొని బాలయ్య ఆ ప్రాజెక్ట్ ని పక్కన పెట్టాడట . మామూలుగా ఎవరి సలహాలూ పట్టించుకోని బాలయ్య.. ఈ ప్రాజెక్టు విషయంలో మాత్రం సన్నిహితుల హెచ్చరికల్ని పట్టించుకున్నట్లు తెలుస్తోంది.