Homeఎంటర్టైన్మెంట్Balakrishna Movie With Young Director: మరో యంగ్ డైరెక్టర్ తో బాలయ్య కొత్త సినిమా.....

Balakrishna Movie With Young Director: మరో యంగ్ డైరెక్టర్ తో బాలయ్య కొత్త సినిమా.. లైనప్ మాములుగా లేదు

Balakrishna Movie With Young Director: సీనియర్ హీరోలలో నందమూరి బాలకృష్ణ ఊపు ప్రస్తుతం మాములు రేంజ్ లో లేదు..అఖండ సినిమా తో కెరీర్ లోనే భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్న బాలకృష్ణ ఆ తర్వాత క్రాక్ సినిమా దర్శకుడు గోపీచంద్ మలినేని తో ఒక్క సినిమా చేస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే..ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతుంది..ఇప్పటికే ఈ సినిమాలోని బాలయ్య బాబు కి సంబంధించిన రెండు విబిబిన్నమైన లుక్స్ ని ఆ మూవీ టీం విడుదల చేసిన సంగతి మన అందరికి తెలిసిందే..ఇందులో కూడా బాలయ్య బాబు ద్విపాత్రాభినయం చేస్తున్నాడు..కన్నడ హీరో దునియా విజయ్ ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు..ఇక ఈ సినిమా తో పాటుగా బాలయ్య బాబు అనిల్ రావిపూడి తో ఒక్క సినిమా చెయ్యబోతున్న సంగతి మన అందరికి తెలిసిందే..బాలయ్య బాబు తన కెరీర్ లో ఇప్పటి వరుకు ఎన్నడూ చెయ్యని రోల్ ని ఈ సినిమాలో చేస్తున్నాడు..ఈ సినిమా ప్రియమణి మరియు పెళ్ళిసందడి హీరోయిన్ శ్రీ లీల ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు..ఇందులో శ్రీ లీల బాలయ్య బాబు కి కూతురు గా నటిస్తుంది అట.

Balakrishna Movie With Young Director
Balakrishna

Also Read: Director Om Raut- Prabhas: అందుకే ప్రభాస్ ఆదిపురుష్ అయ్యారు!

ఇలా అభిమనుల కోరిక మేరకు వరుసగా యంగ్ డైరెక్టర్స్ తోనే సినిమాలు చేస్తున్న బాలయ్య ఇప్పుడు మరో యంగ్ డైరెక్టర్ తో చెయ్యబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి..అసలు విషయానికి వస్తే త్వరలోనే ఆయన యువ దర్శకుడు BVS రవి తో ఒక్క సినిమా చేయబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి..BVS రవి కి రచయితా గా టాలీవుడ్ లో మంచి బ్లాక్ బస్టర్ హిట్స్ ఉన్నప్పటికీ కూడా డైరెక్టర్ గా మాత్రం ఆయనకీ ఆసీమ్హిన స్థాయి హిట్స్ లేవు అనే చెప్పాలి..ఇప్పటి వరుకు ఆయన దర్శకత్వం లో వచ్చిన వాంటెడ్ మరియు జవాన్ వంటి సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద దారుణమైన ఫ్లాప్స్ గా నిలిచాయి..అలాంటి డైరెక్టర్ కి బాలయ్య బాబు ఛాన్స్ ఇవ్వడం పై అభిమానులు కాస్త కంగారు పడుతున్నారు..కానీ బాలయ్య ప్రస్తుతం తన కెరీర్ లో ఆచి ట్టూచినా దిగులు వేస్తున్నారు అని, స్క్రిప్ట్ బలంగా ఉంది కాబట్టే ఆయన ఈ సినిమా ఒప్పుకొని ఉంటాడు అని అభిమానులు భావిస్తున్నారు..ఈ సినిమా తో పాటు గా బోయపాటి శ్రీనుతో బాలయ్య బాబు రెండు సినిమాలు చెయ్యబోతున్న సంగతి మన అందరికి తెలిసిందే..అందులో ఒక్కటి అఖండ కి సీక్వెల్ కాగా, మరొక్కటి పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో వచ్చే సినిమా..ఈ రెండు సీనియాలతో పాటుగా పూరి జగన్నాథ్ తో కూడా ఒక్క సినిమా చెయ్యబోతున్నాడు బాలయ్య..ఇలా వరుస సినిమాలతో ఆరు పదుల వయస్సులో కూడా కుర్ర హీరోలకు పోటీని ఇస్తూ ముందుకి దూసుకుపోతున్నాడు బాలయ్య బాబు.

Balakrishna Movie With Young Director
BVS Ravi, Balakrishna

Also Read: Chakravakam: చక్రవాకం నటులు ఏం చేస్తున్నారో తెలుసా?

Recommende Videos:
బంగారంలా గెలిపించుకుంటాం పవన్ ని || Common Man Great Words About Pawan Kalyan || Ponnur Public Talk
బీహార్ కుల గణన వల్ల ఏం జరగబోతుంది ? || Analysis on Bihar Caste Census || View Point || Ok Telugu
వైసీపీ పార్టీ పేరులో రైతు ఉంది, కానీ..! || Pawan Kalyan About YSRCP Party Definition || Ok Telugu

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Exit mobile version