Balakrishna: నందమూరి బాలకృష్ణ లీడ్ రోల్ చేసిన అఖండ మూవీ గతేడాది డిసెంబర్ నెలలో విడుదలై హిట్ టాక్ తెచ్చుకుంది. కలెక్షన్ల పరంగా చూసుకున్నట్టైతే ఇప్పటివరకు ఈ సినిమా రూ.125 కోట్లు రాబట్టినట్టు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అదే నిజమైతే బాలయ్య బాబు కెరీర్‌లోనే అఖండ సంచలన విజయాన్ని నమోదు చేసుకున్నట్టు తెలుస్తోంది. బోయపాటి, బాలయ్య బాబు కాంబోలో వచ్చిన అఖండ మూవీ హ్యాట్రిక్ విజయం.. ఇప్పటికీ కూడా థియేటర్లలో విజయవంతంగా రన్ అవుతోంది. కొవిడ్ టైంలో సినిమా విడుదలైనా ప్రేక్షకులను థియేటర్లకు రప్పించిన మూవీ అఖండ అని చెప్పుకోవచ్చు. ఈ మూవీలో బాలయ్య బాబు తన నట విశ్వరూపాన్ని చూపించారు.

సంక్రాంతి పండుగ వస్తున్న నేపథ్యంలో వసూళ్లు పెరిగేందుకు బాలయ్య బాబు అదిరిపోయే మాస్టర్ ప్లాన్ వేశారట.. పాపం ఈ విషయం తెలీక బన్నీ తొందరపడ్డాడని టాక్ వినిపిస్తోంది. బన్నీ నటించిన పాన్ ఇండియన్ మూవీ ‘పుష్ప ది రైజ్’ చిత్రం జనవరి-7న ఓటీటీ ప్లాట్ ఫాం అమెజాన్‌లో రిలీజ్ అయ్యింది. ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకున్నా కలెక్షన్ల పరంగా దూసుకుపోతుంది. ఈ క్రమంలోనే బన్నీ తొందపడ్డాడని, సంక్రాంత్రి తర్వాత ఓటీటీలో రిలీజ్ చేస్తే బాగుండేదని కొందరు అంటున్నారు. ఓటీటీలో రిలీజ్ కావడం వలన థియేటర్లకు వచ్చే జనాల సంఖ్య క్రమంగా తగ్గిపోతోంది.
Also Read: పదేళ్లు పూర్తి చేసుకున్న ‘బిజినెస్ మెన్’.. అప్పటి కలెక్షన్స్ చూస్తే..!
ఇక సంక్రాంత్రి బరిలో పెద్ద సినిమాలు విడుదల కావడం లేదు. అక్కినేని నాగార్జున, నాగచైతన్య నటించిన బంగార్రాజు చిత్రంతో పాటు కొన్ని చిన్న సినిమాలు పండుగకు సందడి చేసేందుకు సిద్ధమయ్యాయి. నాని నటించిన శ్యాం సింగరాయ్ ఇప్పటికే జనాలు చూసేసారు. రెండోసారి చూసేంత స్టోరీ అందులో లేదని ఆడియెన్స్ చెబుతున్నారు.
బంగార్రాజు మూవీ తర్వాత మళ్లీ థియేటర్లలో చూసే సినిమా అంటే అఖండ ఒక్కేట.. దీంతో సక్సెస్ మీట్ నిర్వహించిన మూవీ టీం పండుగకు మరోసారి ప్రమోషన్ స్టార్ట్ చేసింది. కలెక్షన్లు పెరుగుతాయని అఖండ చిత్ర బృందం భావిస్తోంది. ఓటీటీలో రిలీజ్ కాకుంటే పుష్పకు కలెక్షన్లు పెరిగేవి. ఇప్పుడు అవి కాస్త బాలయ్య బాబు ఖాతాలోకి వెళ్లనున్నాయి.అందు కోసమే సంక్రాంత్రి తర్వాత అఖండను ఓటీటీలో విడుదల చేసేందుకు బాలయ్య బాబు ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది.
Also Read: జగన్ కు చిరంజీవి అంటే ఇష్టం.. నేనే వెళ్ళమన్నాను – నాగార్జున