Business Men: సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలున్నాయి. కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ‘మురారి’, గుణశేఖర్ దర్శకత్వలో వచ్చిన ‘ఒక్కడు’ సినిమాలు ముందువరుసలో నిలుస్తాయి. ఆ తర్వాత పూరి జగన్నాథ్ డైరెక్షన్లో వచ్చిన ‘పోకిరి’ ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది. వీరి కాంబినేషన్ ను ‘బిజినెస్ మెన్’ మరోసారి రిపీట్ చేసింది. ఈ సినిమా అప్పట్లో ఎన్నో రికార్డులను తిరగరాయడంతోపాటు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది.

Mahesh Babu
ఒకసారి పదేళ్ల వెనక్కి వెళితే.. ‘బిజినెస్ మెన్’ చేసే సమయంలో ఒక పెద్ద సినిమా తీయాలంటే దాదాపు ఎనిమిది నెలల సమయం పట్టేది. అయితే వాటిన్నింటిని పూరి జగన్మాథ్ బ్రేక్ చేశాడు. కేవలం రెండున్నర నెలల్లోనే(74రోజులు) పూర్తి చేసి అందరి ప్రశంసలను అందుకున్నాడు. 2012లో సంక్రాంతి కానుకగా రిలీజైన ‘బిజినెస్ మెన్’ మూవీ మహేష్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచింది.
ఏపీ, తెలంగాణలో ఈ మూవీకి 35.37కోట్ల షేర్ రాగా 50కోట్లకు పైగా గ్రాస్ వచ్చింది. రెస్ట్ ఆఫ్ ఇండియాలో 8.85కోట్లు రాగా, ప్రపంచ వ్యాప్తంగా 41.22 కోట్ల షేర్ వచ్చింది. అప్పట్లో ఈ కలెక్షన్స్ రికార్డే. ఈ మూవీకి కేవలం 11రోజుల్లోనే థమన్ బ్రాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించాడు.
తన జీవితం ఫాస్టెస్ సినిమా ఇదేనంటూ మ్యూజిక్ డైరక్టర్ థమన్ తన ట్వీటర్లో వెల్లడించారు. ‘బిజినెస్’ మెన్ విశేషాలను అభిమానులతో పంచుకున్నాడు. ‘బిజినెస్ మెన్’ ఇప్పటికే యంగ్ గానే ఉన్నారని.. పూరి డైరెక్షన్ కు 5 స్టార్స్ అంటూ కితాబిచ్చాడు. ఈ మూవీకి మ్యూజిక్ అందించడం వంద మీటర్ల రేసు లాంటిదని థమన్ చెప్పుకొచ్చాడు.