https://oktelugu.com/

ఫోన్ చేసి ధైర్యం నూరిపోసిన బాలయ్య !

‘నట సింహం నందమూరి బాలకృష్ణ’ తన అభిమానులలో ఎవరైనా ఆపదలో ఉన్నారని తెలిస్తే, వెంటనే వారికి సాయం చేయడానికి పూనుకుంటారు. మొత్తానికి తనలోని సేవా గుణాన్ని బాలయ్య ఎప్పటికప్పుడు సక్సెస్ ఫుల్ గా ప్రదర్శిస్తూనే ఉన్నాడు. ఈ క్రమంలో మరోసారి బాలయ్య తన పెద్ద మనసును సగర్వంగా చాటుకున్నాడు. మంచాన పడ్డ తన అభిమానికి స్వయంగా ఫోన్ చేసి ధైర్యం నూరిపోశారు. వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా గొల్లపల్లికి చెందిన మురుగేష్ బాలయ్యకి వీరాభిమాని. […]

Written By:
  • admin
  • , Updated On : June 14, 2021 / 11:35 AM IST
    Follow us on

    ‘నట సింహం నందమూరి బాలకృష్ణ’ తన అభిమానులలో ఎవరైనా ఆపదలో ఉన్నారని తెలిస్తే, వెంటనే వారికి సాయం చేయడానికి పూనుకుంటారు. మొత్తానికి తనలోని సేవా గుణాన్ని బాలయ్య ఎప్పటికప్పుడు సక్సెస్ ఫుల్ గా ప్రదర్శిస్తూనే ఉన్నాడు. ఈ క్రమంలో మరోసారి బాలయ్య తన పెద్ద మనసును సగర్వంగా చాటుకున్నాడు. మంచాన పడ్డ తన అభిమానికి స్వయంగా ఫోన్ చేసి ధైర్యం నూరిపోశారు.

    వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా గొల్లపల్లికి చెందిన మురుగేష్ బాలయ్యకి వీరాభిమాని. అయితే, కొంతకాలం క్రితం అతను ఒక చెట్టు మీద నుంచి కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. పైగా ఆ ప్రమాదంలో అతని నడుము విరిగింది. అప్పటి నుంచి మంచానికే పరిమితం అయ్యాడు, తన అభిమాని మురుగేష్ గురించి తెలుసుకున్న బాలయ్య, అతని నంబర్ తీసుకొని స్వయంగా ఫోన్ చేశారు.

    అతనితో అధైర్యపడొద్దు అని, టైం ప్రకారం మందులు వాడుతూ, ఫిజియోథెరపీ చేయించుకోమంటూ తక్షణ అవసరాల కోసం రూ.40 వేలు కూడా అతనికి పంపించారు. ధైర్యంగా ఉంటే స్పీడ్ గా తిరిగి కోలుకోవచ్చు అని తన అభిమానికి బాలయ్య తెలియజేశాడు. కరోనా వచ్చినప్పటి నుండి బాలయ్య పలు సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు.

    సెకెండ్ వేవ్ వచ్చిన తర్వాత కూడా తన నియోజకవర్గ ప్రజలలో కొంత మంది కరోనా సోకి బెడ్స్ దొరకక ఇబ్బందులు పడుతుంటే, ఆ కరోనా రోగుల కోసం హిందీ పూర్ లోని తన గెస్ట్ హౌస్ లో బెడ్స్ ను ఏర్పాటు చేసి, వారికి సాయం చేశాడు. పైగా ఆ కరోనా రోగులకు అండగా 20 లక్షలు ఖర్చు పెట్టి పేదలకు మెడిసిన్ తో పాటు మెడికల్ సదుపాయాలను కూడా సమకూర్చడం విశేషం.