BalaKrishna : తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి నరసింహంగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న బాలయ్య బాబు (Balayya Babu) చేసిన ప్రతి సినిమా కూడా మంచి విజయాన్ని సాధిస్తూ ముందుకు సాగుతూ ఉండడం విశేషం…. ఆయన చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిద్యమైన కథాంశం అయితే ఉంటుంది. ఇక ఆయనకంటు ఒక స్పెషల్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవడానికి ఆయన అహర్నిశలు ప్రయత్నమైతే చేస్తూ ఉంటాడు…ఇక రీసెంట్ గా ఆయనకు ‘పద్మభూషణ్ అవార్డు’ ఆయితే ప్రకటించారు. దానికి తగ్గట్టుగానే తన సోదరి అయిన భువనేశ్వరి గారు బాలయ్య బాబుకి పద్మభూషణ్ అవార్డు వచ్చిన సందర్భంలో ఒక పార్టీని అయితే కండక్ట్ చేశారు. ఇక ఆ పార్టీకి బాలయ్య బాబుకి చంద్రబాబు నాయుడుకి చాలా సన్నిహితంగా ఉండే కొంతమంది వ్యక్తులు మాత్రమే హాజరయ్యారు…ఇక ఈ పార్టీలో బాలయ్య బాబు మాట్లాడుతూ తనకు తన భార్య అయిన వసుంధర అంటే చాలా ఇష్టం అని చెప్పాడు. అలాగే మెన్షన్ హౌజ్ అంటే కూడా తనకు చాలా ఇష్టమని చెప్పాడు. ఒక రకంగా నేను వసుంధర ను ప్రేమిస్తే నన్ను మెన్షన్ హౌజ్ ప్రేమించింది అంటూ ఆయన ఒక తీయిరి అయితే చెప్పాడు. ఇక మొత్తానికైతే బాలయ్య బాబు కి వసుంధర, మెన్షన్ హౌజ్ రెండు రెండు కండ్లని చెప్పడం విశేషం… ఇక తన కెరీర్లో తనతో పాటు చేసిన హీరోయిన్లలో ఆయన మొదటగా విజయశాంతి అంటే చాలా ఇష్టమని చెప్పాడు.
అలాగే ఈయన తర్వాత రమ్యకృష్ణ, సిమ్రాన్ అంటే కూడా తనకు చాలా ఇష్టమని తెలియజేయడం విశేషం…బాలయ్య బాబు, విజయశాంతి కాంబినేషన్ లో సూపర్ డూపర్ సక్సెస్ ఫుల్ సినిమాలైతే వచ్చాయి. లారీ డ్రైవర్, రౌడీ ఇన్స్పెక్టర్ లాంటి సినిమాలతో బాలయ్య బాబు తన నట విశ్వరూపాన్ని చూపించాడు.
ఇక ఈ రెండు సినిమాల్లో కూడా విజయశాంతి హీరోయిన్ కావడం విశేషం…ఇక వీటితో పాటుగా మరికొన్ని సినిమాల్లో కూడా విజయశాంతి హీరోయిన్ గా నటించింది. ఇక రమ్యకృష్ణతో కూడా ‘బంగారు బుల్లోడు’ లాంటి సినిమాల్లో నటించాడు. ఇక వీళ్లిద్దరు కాకుండా సిమ్రాన్ తో ఆయన చేసిన సినిమాలు చాలా సక్సెస్ ను సాధించాయి.
సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, సీమ సింహం,ఒక్క మగాడు లాంటి సినిమాల్లో సిమ్రాన్ తో కలిసి నటించి మెప్పించాడు. ఇక వీళ్లిద్దరి కాంబినేషన్ కి మంచి గుర్తింపైతే ఉంది… ఇక మొత్తానికైతే బాలయ్య బాబు ప్రస్తుతం ఈ ఏజ్ లో కూడా మంచి సినిమాలను చేస్తూ వరుస సక్సెస్ లను సాధిస్తున్నాడు. సీనియర్ హీరోలందరిలో కూడా తను ఇప్పుడు టాప్ పొజిషన్ లో ఉన్నాడనే చెప్పాలి…