https://oktelugu.com/

BalaKrishna: 30 ఏళ్ళ క్రితమే KGF ని తీసేసిన బాలయ్య బాబు

BalaKrishna: ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద KGF చాప్టర్ 2 సృష్టించిన ప్రభంజనం ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..మొదటి భాగం కంటే రెండవ భాగం బాక్స్ ఆఫీస్ వద్ద 5 రేట్లు ఎక్కువ వసూళ్లను రాబట్టి ప్రతి భాషలో ప్రభంజనం సృష్టించింది..ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషలకు కలిపి 900 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ ని వసూలు చేసిన ఈ చిత్రం అతి త్వరలోనే వెయ్యి కోట్ల రూపాయిలు వసూలు చేసే దిశగా ముందుకి దూసుకుపోతుంది..ఇది ఇలా ఉండగా ఈ […]

Written By:
  • Neelambaram
  • , Updated On : April 26, 2022 / 06:36 PM IST
    Follow us on

    BalaKrishna: ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద KGF చాప్టర్ 2 సృష్టించిన ప్రభంజనం ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..మొదటి భాగం కంటే రెండవ భాగం బాక్స్ ఆఫీస్ వద్ద 5 రేట్లు ఎక్కువ వసూళ్లను రాబట్టి ప్రతి భాషలో ప్రభంజనం సృష్టించింది..ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషలకు కలిపి 900 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ ని వసూలు చేసిన ఈ చిత్రం అతి త్వరలోనే వెయ్యి కోట్ల రూపాయిలు వసూలు చేసే దిశగా ముందుకి దూసుకుపోతుంది..ఇది ఇలా ఉండగా ఈ సినిమా ని గతం లో మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన రాక్షసుడు అనే సూపర్ హిట్ సినిమా స్టోరీ ని ఆధారంగా తీసుకొని తెరకెక్కించినట్టు సోషల్ మీడియా లో కథనాలు వచ్చాయి..ఇప్పుడు ఈ సినిమా బాలకృష్ణ హీరో గా నటించిన మరో సినిమాని కూడా ఆదర్శంగా తీసుకున్నట్టు సోషల్ మీడియా లో లేటెస్ట్ గా కొన్ని కథనాలు ప్రచారం అవుతున్నాయి..ఆ విశేషాలు ఏమిటో ఇప్పుడు మనం చూద్దాము.

    Balakrishna

    1993 వ సంవత్సరం లో నందమూరి బాలకృష్ణ హీరో గా నటించిన నిప్పురవ్వ అనే సినిమా విడుదల అయ్యింది..ఈ సినిమా మొత్తం బొగ్గు ఘనుల నేపథ్యం లో కొనసాగుతుంది..ఈ సినిమాలో కూడా జనాలను బలవంతంగా బొగ్గు గనుల్లో తవ్వకానికి తీసుకొచ్చి వాళ్ళని ఎన్నో విధాలుగా హింసలు పెడుతారు విలన్స్..ఒక్కగానొక్క సందర్భం లో బిగ్గు గనుల ప్రాంతం లో జరిగిన ఒక్క ప్రమాదం లో చాలా మంది కార్మికులు చనిపోతారు..కొంతమంది కార్మికులను మాత్రం బాలయ్య బాబు ప్రాణాలకు తెగించి రిస్క్ చేసి కాపాడుతాడు..చనిపోయిన వారి కుటుంబాలకు ఆర్ధిక సహాయం చెయ్యాలని యాజమాన్యం పై బాలయ్య బాబు పోరాటం చేస్తాడు..ఈ మధ్యలో వచ్చే కొన్ని భారీ ఫైట్ సీన్స్ మరియు ఎలేవేషన్స్ KGF కి ఏ మాత్రం తగ్గవు అనే చెప్పాలి..భారీ బడ్జెట్ తో A .కోందండరామి రెడ్డి గారి దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకుల ఆధారణని అందుకోలేకపోయింది.

    Nippu Ravva

    Also Read: Shruti Haasan: ప్రైవేట్ పార్ట్స్ సర్జరీల ‘శ్రుతి హాసన్’ క్లారిటీ.. మరి ఎఫైర్లు సంగతి ?

    ఎన్నోసార్లు వాయిదాలు పడుతూ విడుదల అయిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడానికి కారణం కూడా బాలయ్య సినిమానే..ఎందుకంటే ఈ సినిమా విడుదల అయిన రోజున బాలయ్య నటించిన మరో సినిమా ‘బంగారు బుల్లోడు’ విడుదల అయ్యింది..ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలబడగా నిప్పురవ్వ మాత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిచింది..అలా ఒక్కేరోజు రెండు సినిమాలు విడుదల చేసిన ఏకైక స్టార్ హీరో గా బాలయ్య బాబు సరికొత్త చరిత్ర సృష్టించాడు..కానీ ఇలా విడుదల చెయ్యడం వల్ల ఒక్క సినిమా కచ్చితంగా దెబ్బ తింటుంది అనడానికి ఉదాహరణగా కూడా నిలిచింది ఈ సందర్భం..కంటెంట్ పరంగా నిప్పురవ్వ సినిమా బాగానే ఉన్నప్పటికీ ..అదే రోజు విడుదల అయిన బాలయ్య మరో సినిమా బంగారు బుల్లోడు దీనికంటే బాగా ఉండడం తో ఆ మూవీ ప్రభావం నిప్పు రవ్వ మూవీ పై గట్టిగ పడింది అని ట్రేడ్ పండితుల అభిప్రాయం..ఒక్కవేల నిప్పు రవ్వ సినిమా వేరే తేదీన విడుదల అయ్యి ఉంటె బాక్స్ ఆఫీస్ వద్ద కనీసం యావరేజి గా నిలిచేది అట.

    Also Read: Mahesh Babu Rajamouli Went Dubai: దుబాయి కి మహేష్ బాబు తో వెళ్లిన రాజమౌళి.. అభిమానులకు పూనకాలు రప్పించే వార్త

    Recommended Videos:

    Tags