Balakrishna : రవితేజ పాట వింటూ ఊగిపోయిన బాలయ్య బాబు.. ఈ వీడియో చూస్తే తట్టుకోలేరంతే!

బాలయ్యకు సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతుండగా భగవంత్ కేసరి సినిమాతో బాలయ్య పాన్ ఇండియా హిట్ అందుకుంటారేమో చూడాలి.

Written By: NARESH, Updated On : September 28, 2023 8:19 pm

balakrishna1

Follow us on

Balakrishna  : బాలయ్య.. సెకండ్‌ ఇన్నింగ్‌లో సంచలన సినిమాలతో యువ హీరోలకే చాలెంజ్‌ విసురుతున్నాడు. ఇప్పటికే లెజెండ్‌, అఖండ లాంటి సినిమాలతో సూపర్‌ విక్టరీ కొట్టిన బాలయ్య తాజాగా భగవంత్ కేసరి సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా అక్టోబర్ నెల 19వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాకు సంబంధించిన కీలక అప్‌డేట్‌ మరికొన్ని గంటల్లో రానుంది.

మిర్యాలగూడలో బాలయ్య బ్రేక్‌ఫాస్ట్‌..
అయితే మాస్ మహారాజ్ ధమాకా సినిమాలోని పాట వింటూ బాలయ్య సూర్యాపేటలో బ్రేక్ ఫాస్ట్ చేశారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ధమాకా సినిమాలోని సాంగ్ బ్యాగ్రౌండ్‌లో ప్లే అవుతుండగా బాలయ్య ఆ పాటను ఎంజాయ్ చేస్తూ బ్రేక్ ఫాస్ట్ చేయడం గమనార్హం. భగవంత్ కేసరి సినిమా నుంచి త్వరలో సెకండ్ సింగిల్ రిలీజ్ కానుందని సమాచారం అందుతోంది.

పెరుగుతున్న అంచనాలు..
మరోవైపు భగవంత్ కేసరి సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. భగవంత్ కేసరి సినిమా ట్రైలర్ రిలీజ్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా కాజల్ ఈ సినిమాలో నటిస్తుండగా శ్రీలీల కీలక పాత్రలో నటిస్తున్నారు. అర్జున్ రాంపాల్ ఈ సినిమాలో విలన్ రోల్‌ పోషిస్తున్నారు. బాలీవుడ్లో కూడా ఈ సినిమా రికార్డ్ స్థాయిలో కలెక్షన్లు సాధించే ఛాన్స్ ఉంది. ఈ సినిమాకు థమన్ బీజీఎం నెక్స్ట్ లెవల్‌లో ఉండనుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. బాలయ్య రేంజ్ ను భగవంత్ కేసరి మరింత పెంచడంతో పాటు బాలయ్యకు హ్యాట్రిక్ ను అందిస్తుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

రూ.20 కోట్ల రెమ్యునరేషన్‌..
బాలయ్య ఈ సినిమాకు 20 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ అందుకున్నారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో భగవంత్‌ కేసరి సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తోంది. బాలయ్యకు సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతుండగా భగవంత్ కేసరి సినిమాతో బాలయ్య పాన్ ఇండియా హిట్ అందుకుంటారేమో చూడాలి.