https://oktelugu.com/

Balakrishna: అనూహ్యంగా మధ్యలో ఆగిపోయిన బాలకృష్ణ భారీ బడ్జెట్ మూవీ ..అది చేసి ఉంటే!

బాలకృష్ణ, దర్శకుడు కోడి రామకృష్ణ కాంబినేషన్ లో పలు హిట్ సినిమాలు వచ్చాయి. ఈ ఇద్దరి కాంబోలో ఓ జానపద సినిమాను తెరకెక్కించాలని భార్గవ్ ఆర్ట్స్ ఎస్ గోపాలరెడ్డి ప్లాన్ చేశారట.

Written By:
  • S Reddy
  • , Updated On : March 7, 2024 / 01:32 PM IST

    Balakrishna

    Follow us on

    Balakrishna: ప్రస్తుతం ఫిల్మ్ ఇండస్ట్రీలో పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తోంది. భారీ బడ్జెట్ తో సినిమాలు తెరకెక్కిస్తున్నారు దర్శకులు. తమ టాలెంట్ ప్రూవ్ చేసుకుని దేశవ్యాప్తంగా క్రేజ్ దక్కించుకుంటున్నారు. గతంలో ఒక భాషకే హీరోల ఇమేజ్ పరిమితం అయ్యేది. ఇప్పుడు పలు భాషల్లో ఫ్యాన్ బేస్ సంపాదిస్తున్నారు. కాగా నందమూరి బాలకృష్ణ హీరోగా చాలా ఏళ్ళ క్రితం భారీ బడ్జెట్ మూవీ స్టార్ట్ చేశాడు. ఆ మూవీ షూటింగ్ పూర్తి కాకుండానే మధ్యలో ఆగిపోయింది.

    బాలకృష్ణ, దర్శకుడు కోడి రామకృష్ణ కాంబినేషన్ లో పలు హిట్ సినిమాలు వచ్చాయి. ఈ ఇద్దరి కాంబోలో ఓ జానపద సినిమాను తెరకెక్కించాలని భార్గవ్ ఆర్ట్స్ ఎస్ గోపాలరెడ్డి ప్లాన్ చేశారట. 2001 లో ‘విక్రమ సింహ భూపతి’ అనే టైటిల్ తో ఈ మూవీ అనౌన్స్ చేశారు. హీరోయిన్స్ గా రోజా, పూజా బాత్రాలని అనుకున్నారు. ఇళయరాజా మ్యూజిక్, సినిమాటోగ్రాఫర్ గా కబీర్ ఖాన్ ని సెలెక్ట్ చేశారట.

    సినిమా షూటింగ్ మొదలయ్యాక అర్ధాంతరంగా ఆగిపోయిందట. ఇందుకు కారణం నిర్మాత గోపాలరెడ్డితో బాలయ్యకు వచ్చిన విబేధాలేనట. తర్వాత ఎలాగైనా సినిమా పూర్తి చేయాలని గోపాలరెడ్డి, అతని తనయుడు చాలా ప్రయత్నాలు చేశారట. కానీ అవేమీ ఫలించలేదట. అలా రెండు దశాబ్దాల క్రితం బాలకృష్ణ పాన్ ఇండియా మూవీ మధ్యలో ఆగిపోయింది. అలాగే నర్తనశాల కూడా బాలకృష్ణ మొదలుపెట్టి మధ్యలో ఆపేశాడు. హీరోయిన్ సౌందర్య మరణంతో ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది.

    కాగా అఖండ మూవీతో బాలయ్య ఫుల్ ఫార్మ్ లోకి వచ్చారు. అఖండ, వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి చిత్ర విజయాలతో హ్యాట్రిక్ కొట్టారు. ఆహా లో స్ట్రీమ్ అవుతున్న అన్ స్టాపబుల్ విత్ బాలయ్య షో తో యూత్ లో మరింత క్రేజ్ పెరిగింది. ఇక తన నెక్స్ట్ సినిమా వాల్తేరు వీరయ్య ఫేమ్ బాబీ తో చేస్తున్నారు. ఇది బాలయ్య 109వ చిత్రం కావడం విశేషం. అలాగే మంచు విష్ణు హీరోగా తెరకెక్కుతున్న ‘ కన్నప్ప’ లో కీలక పాత్ర చేయనున్నాడని సమాచారం.