
నటసింహం బాలయ్య బాబు ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘మోనార్క్’ అనే మరో రొటీన్ యాక్షన్ కొట్టుడు సినిమా ఒకటి చేస్తున్న సంగతి తెలిసిందే. నిజానికి ఈ సినిమా మొదలుపెట్టకముందు నుంచే అనేక సమస్యలతో సతమతమవుతుంది. ఇంకా హీరోయిన్ సమస్య తీరలేదు. ఇప్పుడు బడ్జెట్ సమస్య వచ్చి పడింది. గత కొన్ని ఏళ్లుగా బాలయ్య సినిమాలే కలెక్షన్స్ విషయంలో పూర్తిగా డిజాస్టర్ లు అవుతున్నాయి. దాంతో బాలయ్య బాబుకు భారీ బడ్జెట్ పెట్టే నిర్మాతలు కరవు అయిపోయారు. అయినా ఎందుకు పెట్టాలి.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్
బాలకృష్ణ గత నాలుగు సినిమాలు గట్టిగా పది కోట్లు కూడా కలెక్ట్ చేయలేదు.. అలాంటప్పుడు ఏభై డెబ్భై కోట్లు ఏమి చూసి పెట్టాలి అని ఓ నిర్మాత అడిగాడట. బాలయ్య మార్కెట్ అంతలా పడిపోవడానికి కారణం మాత్రం బాలయ్యనే. గత కొన్ని సినిమాలుగా బాలయ్య వెరీ రెగ్యులర్ సినిమాలు చేస్తున్నాడు. పసలేని యాక్షన్ సీన్స్ లతో, అరిగిపోయిన వార్నింగ్ డైలాగ్సేతోనే హిట్ కొట్టడానికి శతవిధాల ప్రయత్నిస్తున్నాడు. అయినా, ఈ డిజిటల్ జనరేషన్ లో కూడా పాత చింతకాయ పచ్చడి యాక్షన్ సీన్స్ తోనే బండి నడిపేయాలని కిందామీద పడితే బాక్సాఫీస్ దగ్గర ఎలా నిలబడగలడు.
Also Read: ‘ఆది పురుష్’కి సప్రైజ్ ఇచ్చిన ప్రభాస్ ఫ్యాన్స్ !
పైగా ప్రస్తుతం బోయపాటి ప్లాప్స్ లో ఉన్నాడు. అందుకే బడ్జెట్ సమస్య వచ్చి పడింది. మొదట ద్వారక క్రియేషన్స్ పతాకం పై నిర్మాత మిర్యాల రవీందర్రెడ్డి ఈ చిత్రాన్ని ఏభై కోట్లు పెట్టి భారీగా నిర్మించాలని ప్లాన్ చేశారు. కానీ పాపం కరోనా దెబ్బకు ప్లాన్ మొత్తం రివర్స్ అయిందట. దాంతో మిర్యాల రవీందర్రెడ్డి ఈ సినిమా బడ్జెట్ ను తగ్గించమని చెప్పి సుమారు నలభై కోట్లు మాత్రమే తాను ఖర్చు పెడతానని బోయపాటికి క్లారిటీ ఇచ్చాడట. ఏది ఏమైనా బాలయ్య కొట్టుడుకు నలభై కోట్లు కూడా వర్కౌట్ అవ్వదనేది నెటిజన్ల అభిప్రాయం. మరి చివరకు బాలయ్య తన సినిమా బడ్జెట్ సమస్యను ఎలా పరిష్కరిస్తాడో చూడాలి.