NBK 107: నట సింహం బాలయ్య – గోపీచంద్ మలినేని సినిమా గురించి ఒక ఇంట్రెస్టింగ్ అప్ డేట్ తెలిసింది. ఈ మూవీ కోసం నందమూరి బాలకృష్ణ అమెరికా వెళ్లనున్నట్లు తెలుస్తోంది. సినిమాలో కొన్ని కీలకమైన యాక్షన్ సన్నివేశాలను అమెరికాలో షూట్ చేయాల్సి ఉంది. వీసా ఫార్మాలిటీస్ ఇప్పటికే పూర్తి కాగా సమ్మర్ తర్వాత బయల్దేరనున్నారట.

మిగతా షూటింగ్ మొత్తం హైదరాబాద్ పరిసరాల్లో జరగనున్నట్లు సమాచారం. అమెరికాలో బాలకృష్ణ మరియు ఇతరులపై భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఇక త్వరలోనే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ ను రివీల్ చేయనున్నారు. మొత్తానికి ఈ అప్ డేట్ బాలయ్య ఫ్యాన్స్ కి ఫుల్ కిక్ ను ఇచ్చేదే.
ఇక ఈ సినిమాలో బాలయ్య డ్యూయల్ రోల్ లో నటిస్తున్నట్లు తెలుస్తోంది. బాలయ్య తండ్రీకొడుకులుగా కనిపిస్తారని.. రెండు పాత్రల మధ్య వేరియేషన్ సినిమాకు హైలెట్‌గా నిలుస్తుందని టాక్ నడుస్తోంది. ఈ సినిమా నుంచి రీసెంట్ గా రిలీజ్ అయిన ‘బాలయ్య ఫస్ట్ లుక్’ అదిరిపోయింది.
బ్లాక్ షర్ట్ లో లుంగీతో దర్శనమిచ్చిన బాలయ్య, బ్లాక్ కారు పక్క నుంచి అలా నడుచుకుంటూ వచ్చి సూపర్ అనిపించాడు. ఇక కథ విషయానికి వస్తే.. రాయలసీమలో నీటి సమస్య చుట్టూ కథ తిరుగుతుందట. మొత్తమ్మీద ఈ సినిమాలో బాలయ్య చాలా పవర్ ఫుల్ గా కనిపించబోతున్నాడు.

మెయిన్ గా బాలయ్య స్టైలిష్ మాసివ్ అవతార్ లో అదరగొట్టడంతో ఈ సినిమా పై అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఇక ఈ సినిమా మైనింగ్ మాఫియా బ్యాక్గ్రౌండ్ నేపథ్యంలో సాగనుంది. ఈ సినిమాలో బాలయ్యను ఢీ కొట్టే విలన్ పాత్రలో కన్నడ నటుడు దునియా విజయ్ నటిస్తున్నారు.
ఏది ఏమైనా ‘అఖండ’ తర్వాత బాలయ్య రేంజ్ మారిపోయింది. ఏపీలో టికెట్ రేట్లును దారుణంగా తగ్గించినా బాలయ్య వంద కోట్ల మార్క్ ను దాటాడు. కాబట్టి.. బాలయ్యకి కరెక్ట్ సినిమా పడితే 150 కోట్లు వసూళ్లు చేసే స్టామినా ఉందని మేకర్స్ నమ్ముతున్నారు.