Balakrishna- Gopichand Malineni Movie Update: నట సింహం బాలయ్య – గోపీచంద్ మలినేని సినిమా గురించి ఒక ఇంట్రెస్టింగ్ అప్ డేట్ తెలిసింది. ఉగాదికి ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ ను రివీల్ చేయనున్నారు. మొత్తానికి ఈ అప్ డేట్ బాలయ్య ఫ్యాన్స్ కి ఫుల్ కిక్ ను ఇచ్చేదే. ఇక ఈ సినిమాలో బాలయ్య డ్యూయల్ రోల్ లో నటిస్తున్నట్లు తెలుస్తోంది. రాయలసీమలో నీటి సమస్య చుట్టూ కథ తిరుగుతుందట.

సినిమాలో బాలయ్య తండ్రీకొడుకులుగా కనిపిస్తారని సమాచారం. రెండు పాత్రల మధ్య వేరియేషన్ సినిమాకు హైలెట్‌గా నిలుస్తుందని టాక్ నడుస్తోంది. ఈ సినిమా నుంచి రీసెంట్ గా రిలీజ్ అయిన ‘బాలయ్య ఫస్ట్ లుక్’ అదిరిపోయింది. బ్లాక్ షర్ట్ లో లుంగీతో దర్శనమిచ్చిన బాలయ్య, బ్లాక్ కారు పక్క నుంచి అలా నడుచుకుంటూ వచ్చి సూపర్ అనిపించాడు.
Also Read: Anasuya Bharadwaj: వైరల్ : రకరకాలుగా అందాలను వెదజల్లుతున్న అనసూయ
మొత్తమ్మీద బాలయ్య చాలా పవర్ ఫుల్ గా కనిపించాడు. మెయిన్ గా బాలయ్య స్టైలిష్ మాసివ్ అవతార్ లో అదరగొట్టడంతో ఈ సినిమా పై అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఇక ఈ సినిమా మైనింగ్ మాఫియా బ్యాక్గ్రౌండ్ నేపథ్యంలో సాగనుంది. ఈ సినిమాలో బాలయ్యను ఢీ కొట్టే విలన్ పాత్రలో కన్నడ నటుడు దునియా విజయ్ నటిస్తున్నారు.
మరోవైపు ఈ సినిమాలో మరో లేడీ పవర్ ఫుల్ పాత్రలో వరలక్ష్మీ శరత్ కుమార్‌ను తీసుకున్నారు. అఖండ బ్లాక్ బస్టర్ తర్వాత బాలయ్య చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా పై భారీ అంచనాలున్నాయి. కాగా ఈ సినిమా కోసం గోపీచంద్ మలినేని స్క్రిప్ట్ లో బాగానే కసరత్తులు చేశాడు. ముఖ్యంగా బాలయ్య పాత్ర పై బాగా వర్క్ చేస్తున్నాడు.

ఈ సినిమా కథ మొత్తం రాయలసీమ – కర్ణాటక బోర్డర్ నేపథ్యంలో జరుగుతుందని.. కథలో రాయలసీమకు చెందిన ఓ సామాజిక అంశాన్ని కూడా ప్రముఖంగా ప్రస్తావించ బోతున్నారని వార్త ఫ్యాన్స్ తెగ హ్యాపీ గా ఫీల్ అవుతున్నారు. మళ్ళీ బాలయ్య నుంచి మరో సూపర్ హిట్ రాబోతుంది అనే నమ్మకం పెరిగింది. ఏది ఏమైనా ‘అఖండ’ తర్వాత బాలయ్య రేంజ్ మారిపోయింది.
అందుకే ఈ సినిమా బడ్జెట్ విషయంలో కూడా మరో 30 కోట్లు పెరిగినట్లు తెలుస్తోంది. ఏపీలో టికెట్ రేట్లును దారుణంగా తగ్గించినా బాలయ్య వంద కోట్ల మార్క్ ను దాటాడు. కాబట్టి.. బాలయ్యకి కరెక్ట్ సినిమా పడితే 150 కోట్లు వసూళ్లు చేసే స్టామినా ఉందని మేకర్స్ నమ్ముతున్నారు.
Also Read: RRR 5th Day Collections: అదే విజృంభణ.. బాక్సాఫీస్ ను తొక్కుకుంటూ పోయింది
[…] Hero Nithin Birthday Special: నితిన్.. పడిలేచిన కెరటం.. ప్రతిభకు నిలువెత్తు నిదర్శనం, హీరో అవ్వాలని ఆశ పడే కుర్రాళ్లకు నిజమైన ఆదర్శం. ప్రతి అవకాశంలోనూ ప్రతిభను కనబరచాలని చూసే హీరోల్లో నితిన్ పేరు కచ్చితంగా ఉంటుంది. ‘ధైర్యం’గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి.. ‘హీరో’గా తొలి చిత్రంతో వి‘జయం’ సాధించి.. ప్రేక్షకుల ‘దిల్’ లో తనకంటూ ఓ స్థానాన్ని సంపాదించుకున్న హీరో నితిన్. […]
[…] Mahesh- Rajamouli Movie: సూపర్ స్టార్ మహేష్ బాబుతో దర్శక ధీరుడు రాజమౌళి ఓ పాన్ ఇండియా సినిమా తీయాలని ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. అయితే, తాజాగా ఈ సినిమా బడ్జెట్ పై సోషల్ మీడియాలో ఒక ఇంట్రెస్టింగ్ అప్ డేట్ వినిపిస్తోంది. బాహుబలి సిరీస్, ఆర్‌ఆర్‌ఆర్ మించిన బడ్జెట్‌తో, అంటే దాదాపు 800 కోట్ల రూపాయలతో మహేశ్ సినిమా ప్లాన్ చేస్తున్నాడట […]