https://oktelugu.com/

Balakrishna- BVS Ravi: బాలయ్యకు ఇంత పెద్ద రిస్క్ అవసరమా?

Balakrishna- BVS Ravi: పరిశ్రమలో బాలయ్యకు భోళా శంకరుడు అనే పేరుంది. అలాగే ఆయనది చిన్న పిల్లల మనస్తత్వం. ఓ హిట్ ఇచ్చినా, కొంచెం మేలు చేసినా సినిమా ఆఫర్ ఇచ్చేస్తాడు. బాలయ్య దర్శకులు, కథల ఎంపిక విషయంలో అంత స్ట్రిక్ట్ గా ఉండరు. అందుకే ఆయనకు హిట్ పర్సెంటేజ్ చాలా తక్కువ. కాగా బాలయ్య డెబ్యూ టాక్ షో అన్ స్టాపబుల్ సూపర్ హిట్ అయ్యింది. ఈ షోకి డైరెక్టర్ గా వ్యవహరించిన బివిఎస్ రవి […]

Written By:
  • Shiva
  • , Updated On : June 1, 2022 / 03:17 PM IST
    Follow us on

    Balakrishna- BVS Ravi: పరిశ్రమలో బాలయ్యకు భోళా శంకరుడు అనే పేరుంది. అలాగే ఆయనది చిన్న పిల్లల మనస్తత్వం. ఓ హిట్ ఇచ్చినా, కొంచెం మేలు చేసినా సినిమా ఆఫర్ ఇచ్చేస్తాడు. బాలయ్య దర్శకులు, కథల ఎంపిక విషయంలో అంత స్ట్రిక్ట్ గా ఉండరు. అందుకే ఆయనకు హిట్ పర్సెంటేజ్ చాలా తక్కువ. కాగా బాలయ్య డెబ్యూ టాక్ షో అన్ స్టాపబుల్ సూపర్ హిట్ అయ్యింది. ఈ షోకి డైరెక్టర్ గా వ్యవహరించిన బివిఎస్ రవి బాలయ్యకు బాగా దగ్గరయ్యాడు. ఆయనకు కొత్త ఇమేజ్ తెచ్చిపెట్టిన ఈ షో పట్ల బాలకృష్ణ చాలా సంతృప్తికరంగా ఉన్నారు.

    Balakrishna- BVS Ravi

    ఈ క్రమంలో బాలయ్యను బివిఎస్ రవి బుట్టలో వేసుకునట్లు తెలుస్తుంది. తరచుగా బాలయ్యను కలుస్తున్న బివిఎస్ రవి ఆయనకో స్టోరీ లైన్ చెప్పి ఒప్పించారట. దాదాపు బివిఎస్ రవి దర్శకత్వంలో బాలయ్య మూవీ ఖాయమే అంటున్నారు. అయితే ఇది పెద్ద రిస్క్ తో కూడుకున్న వ్యవహారం అని చెప్పాలి. బివిఎస్ రవి ట్రాక్ రికార్డు చూసిన ఎవరైనా ఇదే అభిప్రాయం వెల్లడిస్తున్నారు. దర్శకుడిగా రెండు డిజాస్టర్స్ ఇచ్చిన బివిస్ రవితో సినిమా అవసరమా అంటున్నారు.

    Also Read: KK Death Mystery: సింగర్ కెకె మృతిపై అనుమానాలు… విచారణ చేపట్టిన పోలీసులు!

    అఖండ విజయం తర్వాత బాలయ్య లైన్ అప్ చాలా బాగుంది. దర్శకుడు గోపీచంద్ మలినేని, అనిల్ రావిపూడి ప్రతిభ కలిగిన దర్శకులు. వీరితో చేస్తున్న చిత్రాలపై ఫ్యాన్స్ ఆసక్తిగా ఉన్నారు. ఖచ్చితంగా హిట్స్ పడతాయనే నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఇద్దరు దర్శకులు మంచి ఫార్మ్ లో ఉన్నారు. బివిఎస్ రవి విషయానికి వస్తే ఆయన దర్శకుడిగా చేసిన వాంటెడ్, జవాన్ చిత్రాలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. స్క్రీన్ రైటర్ గా కూడా మనోడికి చెప్పుకోదగ్గ రికార్డు లేదు. కెరీర్ బిగినింగ్ లో కొన్ని హిట్స్ ఇచ్చాడు.

    Balakrishna

    ఈ నేపథ్యంలో బాలయ్య దర్శకుడు బివిస్ రవితో మూవీ చేయడం అంటే రిస్క్ చేయడమే అని చెప్పాలి. ప్రస్తుతం పరిశ్రమలో ఇది హాట్ టాపిక్ గా ఉంది.ఈ కాంబినేషన్ పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మరోవైపు బాలయ్య కొడుకు మోక్షజ్ఞ లాంచ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

    Also Read:
    Pavan Kalyan Shocked About KK Death: స్టార్ సింగర్ కెకె మృతిపై పవన్ కళ్యాణ్ దిగ్బ్రాంతి
    Recommended Videos


    Tags