Balakrishna Vs Chiranjeevi: నందమూరి నటసింహం గా మంచి గుర్తింపును సంపాదించుకున్న బాలయ్య బాబు సినిమా ఇండస్ట్రీలో బాక్సాఫీస్ కి చాలాసార్లు తన పంజా దెబ్బ ని రుచి చూపించాడు. బాలయ్య హీరోగా ఒక సినిమా వస్తుందంటే బాక్సాఫీస్ రికార్డులు మొత్తం షేక్ అయ్యేవి. అలాంటి బాలకృష్ణ తన ఎంటైర్ కెరియర్ లో మంగమ్మ మనవాడు, రౌడీ ఇన్స్పెక్టర్, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, సింహ, లెజెండ్, అఖండ లాంటి ఎన్నో భారీ సక్సెస్ లను అందుకుంటూ బాక్సాఫీస్ మీద దండయాత్ర చేశాడు.
ఇక ఇలాంటి బాలయ్య మెగాస్టార్ చిరంజీవిని మాత్రం బీట్ చేయలేకపోయాడు. హిట్లర్ సినిమాకి ముందు వరుసగా చిరంజీవికి ఒక ఐదారు ప్లాప్ సినిమాలు వచ్చాయి. ఆ సందర్భంలో మెగాస్టార్ ని బీట్ చేసే అవకాశం బాలయ్యకి వచ్చింది. అయినప్పటికీ బాలయ్య దాన్ని సరిగ్గా వాడుకోలేదు. అప్పుడు కనక బాలయ్య బాబు కి కరెక్ట్ సినిమాలు పడుంటే మెగాస్టార్ చిరంజీవి రేంజ్ ని దాటేసి ముందుకు వెళ్లేవాడు, కానీ మధ్యలో కొన్ని అనవసరమైన సినిమాలను చేసి ఫ్లాపులను మూటకట్టుకొని చిరంజీవిని బీట్ చేయలేకపోయాడు.
దానికి కారణం బాలయ్య బాబు స్క్రిప్ట్ సెలక్షన్ లో ప్రాబ్లమే అంటూ ఇప్పటికి కూడా బాలయ్య బాబు అభిమానులు ఆ విషయంలో ఒక చిన్నపాటి అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉంటారు. ఆ టైమ్ లో బాలయ్య కనక కరెక్ట్ గా సినిమాలు చేసినట్టయితే చిరంజీవి రేంజ్ లో ఒక మంచి సూపర్ స్టార్ గా బాలయ్య ఎదిగేవాడు. కానీ చిరంజీవి మాత్రం సక్సెస్ విషయం లో బాలయ్య బాబుకి దూరంగా ఉంటూనే వచ్చాడు. బాలయ్య ఎన్ని సక్సెస్ లు కొట్టిన చిరంజీవి అంతకు మించి సక్సెస్ లు సాధిస్తూ వచ్చాడు. ఇక చిరంజీవికి గట్టి పోటీ ఇచ్చిన హీరోలలో బాలయ్య బాబు మొదటి స్థానంలో ఉంటాడు. బాలయ్య చిరు కి పోటీ ఇచ్చాడు కానీ ఇండస్ట్రీ మొత్తాన్ని ఏకచత్రాధిపత్యంతో ఏలే రోజు మాత్రం బాలయ్యకి రాలేదు.
సమరసింహారెడ్డి, నరసింహనాయుడు సినిమాల తర్వాత ఆయన వరుసగా ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ సినిమాలను చేసుకుంటూ వచ్చాడు. అప్పుడు కనక కొంచెం వైవిధ్యం కనబరిచినట్టయితే బాలయ్య చిరంజీవి ని బీట్ చేసేవాడు. కానీ ఒకే తరహా సినిమాలని చేస్తూ మూస ధోరణి లో బాలయ్య వెళ్లడం వల్లే తాను చిరంజీవికి ఆమాడ దూరంలో ఆగిపోవాల్సి వచ్చిందని ఇప్పటికి చాలామంది సినీ మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలు తెలియజేస్తూ ఉంటారు…