https://oktelugu.com/

Balakrishna-Ravi Teja: రవితేజను వెంటాడుతున్న బాలకృష్ణ… ఉద్దేశపూర్వకంగానా? లేక యాదృచ్చికమా?

Balakrishna-Ravi Teja: పరిశ్రమలో హీరోల మధ్య వివాదాలు, ఇగోలు చాలా కామన్. అయితే ఫలానా హీరోతో నాకు గొడవైందని ఎవరూ బయటపెట్టరు. అలాగే హీరోల గురించి ప్రచారమయ్యే అన్ని వార్తల్లో నిజం ఉండకపోవచ్చు. బాలకృష్ణ-రవితేజ మధ్య ఓ హీరోయిన్ విషయంలో గొడవైందని పదిహేనేళ్లుగా ఓ వాదన ప్రచారంలో ఉంది. రవితేజపై మండిపడ్డ బాలకృష్ణ తనను ఇంటికి పిలిపించి మరీ వార్నింగ్ ఇచ్చాడనేది సదరు కథనాల సారాంశం. ఇటీవల బాలకృష్ణ అన్ స్టాపబుల్ షోకి గెస్ట్ గా వచ్చిన […]

Written By:
  • Shiva
  • , Updated On : January 7, 2022 / 01:10 PM IST
    Follow us on

    Balakrishna-Ravi Teja: పరిశ్రమలో హీరోల మధ్య వివాదాలు, ఇగోలు చాలా కామన్. అయితే ఫలానా హీరోతో నాకు గొడవైందని ఎవరూ బయటపెట్టరు. అలాగే హీరోల గురించి ప్రచారమయ్యే అన్ని వార్తల్లో నిజం ఉండకపోవచ్చు. బాలకృష్ణ-రవితేజ మధ్య ఓ హీరోయిన్ విషయంలో గొడవైందని పదిహేనేళ్లుగా ఓ వాదన ప్రచారంలో ఉంది. రవితేజపై మండిపడ్డ బాలకృష్ణ తనను ఇంటికి పిలిపించి మరీ వార్నింగ్ ఇచ్చాడనేది సదరు కథనాల సారాంశం.

    Balakrishna-Ravi Teja

    ఇటీవల బాలకృష్ణ అన్ స్టాపబుల్ షోకి గెస్ట్ గా వచ్చిన రవితేజ ఈ రూమర్ పై స్పందించారు. నీకు నాకు గొడవైందట కదా? అని బాలయ్య అడిగిన ప్రశ్నకు పెద్దగా నవ్వేసిన రవితేజ… అది పని లేని వాళ్ళు సృష్టించిన పుకారు అంటూ క్లారిటీ ఇచ్చారు. బాలయ్య-రవితేజకు గొడవ జరిగిందా లేదా అనేది పక్కనపెడితే, వీరిద్ధరిం మధ్య కొన్ని కోఇన్సిడెంట్స్ చోటు చేసుకుంటున్నాయి. చాలా సార్లు బాలయ్య-రవితేజ బాక్సాఫీస్ వద్ద పోటీపడ్డారు. అలా పోటీపడిన ప్రతిసారి రవితేజకు హిట్ దక్కగా.. బాలయ్యకు డిజాస్టర్ ఎదురైంది.

    ఒక్క మగాడు-కృష్ణ, పరమవీర చక్ర- మిరపకాయ్, మిత్రుడు-కిక్.. బాక్సాఫీస్ వద్ద పోటీపడ్డాయి. బాలయ్య ఒక్క మగాడు, పరమవీర చక్ర, మిత్రుడు సినిమాల ఫలితం గురించి చెప్పాల్సిన అవసరం లేదు. కాగా ఈ ఇద్దరు హీరోల విషయంలో మరో సారూప్యత కొనసాగుతుంది. రవితేజతో సినిమాలు చేసిన దర్శకులను వదలకుండా బాలకృష్ణ చిత్రాలు చేస్తున్నారు.

    Also Read: ప్రముఖ ఓటీటీలో నేటి నుంచి ‘పుష్ప’ స్ట్రీమింగ్..!

    బాలయ్యకు సింహ, లెజెండ్, అఖండ హిట్స్ ఇచ్చిన బోయపాటి రవితేజతో భద్ర లాంటి బ్లాక్ బస్టర్ తెరకెక్కించారు. బాలయ్య తన 107వ చిత్రం గోపీచంద్ మలినేనితో చేస్తున్నారు. గోపీచంద్ మలినేని రవితేజతో దుబాయ్ శీను, బలుపు, క్రాక్ వంటి హిట్ చిత్రాలు చేశారు. కాగా దర్శకులు అనిల్ రావిపూడి, సంపత్ నందితో బాలయ్య తన నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ప్రకటించారు. అనిల్ రావిపూడి రవితేజతో రాజా ది గ్రేట్ తెరకెక్కించారు. అలాగే సంపత్ నంది దర్శకత్వంలో బెంగాల్ టైగర్ చేశారు

    రవితేజను హీరోగా నిలబెట్టిన పూరి జగన్నాధ్ దర్శకత్వంలో బాలయ్య పైసా వసూల్ చిత్రం చేశారు. అలాగే త్వరలో ఆయనతో మూవీ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అలా రవితేజ దర్శకులతో బాలయ్య చిత్రాలు ప్రకటిస్తున్నారు.

    Also Read: ఎన్టీఆర్ ని బీట్ చేసిన చిరంజీవి మొదటి సినిమా… స్టార్ కాకముందే చిరు అద్భుత రికార్డు!

    Tags