https://oktelugu.com/

బాలయ్యకి టైటిల్ ఫిక్స్.. రిలీజ్ డేటే డౌట్ !

బాలయ్య బాబు బోయపాటి శ్రీను సినిమా‌ రిలీజ్ డేట్ ను మే 28కి ఫిక్స్ చేశారనే అప్‌డేట్ ను ఇప్పటికే మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అయితే తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాని మే 21న రిలీజ్ చేయాలని.. చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. ఈ సినిమా కోసమైతే నంద‌మూరి అభిమానులు ఎంతో ఆతృత‌గా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా టైటిల్ ను రివీల్ చేయమని సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. అయితే, వారి ఉత్సాహాన్ని […]

Written By: , Updated On : March 24, 2021 / 05:08 PM IST
Follow us on

Monarch
బాలయ్య బాబు బోయపాటి శ్రీను సినిమా‌ రిలీజ్ డేట్ ను మే 28కి ఫిక్స్ చేశారనే అప్‌డేట్ ను ఇప్పటికే మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అయితే తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాని మే 21న రిలీజ్ చేయాలని.. చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. ఈ సినిమా కోసమైతే నంద‌మూరి అభిమానులు ఎంతో ఆతృత‌గా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా టైటిల్ ను రివీల్ చేయమని సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. అయితే, వారి ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తూ ద‌ర్శ‌క నిర్మాత‌లు ఈ సినిమాకి మోనర్క్ అనే టైటిల్ ను ఖరారు చేయ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది.

Also Read: మరో స్టార్ హీరోకు కరోనా పాజిటివ్

ఏది ఏమైనా బాలయ్య బాబు సినిమాలకు కథ పవర్ ఫుల్ గా లేకపోయినా, టైటిల్స్ మాత్రం పవర్ ఫుల్ గా ఉండేలా బాలయ్య చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు. పైగా బోయపాటి, బాలయ్య సినిమా అంటే కచ్చితంగా అదిరిపోయే టైటిల్ ఉండాలని బాలయ్య ఫ్యాన్స్ కూడా బలంగా కోరుకుంటారు. అందుకే ఈ సినిమా టైటిల్ విషయంలో చాలా రకాలుగా ఆలోచించి ఫైనల్ గా ‘మోనార్క్‌’ అనే టైటిల్‌ ఫిక్స్ చేశారు. నిజానికి ఇదే టైటిల్ పెట్టబోతున్నారని బాగా వినిపించింది. ఓ దశలో మోనార్క్ టైటిల్ ను ఫైనల్ చేశారని కూడా బాగా వార్తలు వచ్చాయి.

Also Read: సినీ నిర్మాత‌ల్లో గుబులు‌.. సెకండ్ వేవ్ ఏం చేయ‌నుంది?

చివరకు ఇదే టైటిల్ ఫిక్స్ అయింది. త్వరలోనే మోనార్క్ టైటిల్ ను అధికారికంగా ప్రకటించనున్నారు. కానీ ఈ సినిమాకు టార్చ్ బెర్రర్ అనే టైటిల్ ను కూడా అనుకున్నారు. ఇక ఈ చిత్రంలో ప్రగ్య జైస్వాల్ మెయిన్ హీరోయిన్. ఇక ఈ సినిమాని మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించనుండగా తమన్ సంగీతం సమకూరుస్తున్నాడు. మొత్తానికి సమ్మర్ లో నందమూరి అభిమానులకు పండుగను ఫిక్స్ చేశారు. అన్నట్టు ఈ సినిమా తరువాత షెడ్యూల్ ను పలనాడులోని కోటప్ప కొండ ప్రాంతంలో షూటింగ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్