Bhagavanth Kesari Twitter Review : భగవంత్ కేసరి ట్విట్టర్ టాక్… రొటీన్ స్టోరీ బట్ బాలయ్య మాస్, ఓవరాల్ ఆడియన్స్ రియాక్షన్ ఇదే!

అంచనాలు పెట్టుకొని వెళితే నిరాశ తప్పదు. బాలయ్య డైలాగ్స్, ఫైట్స్ ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తారు. అనిల్ రావిపూడి మార్క్ కామెడీ ఆశించే వాళ్లకు నిరాశ తప్పదు.

Written By: NARESH, Updated On : October 19, 2023 8:11 am
Follow us on

Bhagavanth Kesari Twitter Review : నటసింహం బాలయ్య లేటెస్ట్ మూవీ భగవంత్ కేసరి. దర్శకుడు అనిల్ రావిపూడి ఎమోషనల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందించారు. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించగా… శ్రీలీల కీలక రోల్ చేసింది. దసరా కానుకగా అక్టోబర్ 19న వరల్డ్ వైడ్ విడుదల చేశారు. యూఎస్ ప్రీమియర్స్ ముగిసిన నేపథ్యంలో ఆడియన్స్ తమ అభిప్రాయం తెలియజేస్తున్నారు. మరి భగవంత్ కేసరితో బాలయ్య హిట్ కొట్టాడా? టాక్ ఎలా ఉంది?

భగవంత్ కేసరి రొటీన్ కథ. గతంలో చాలా సినిమాల్లో చెప్పినదే. ప్రాణప్రదంగా పెంచుకున్న కూతురు సమానమైన అమ్మాయికి కష్టం వస్తే ఆ తండ్రి ఎలా తిరబడ్డాడు. పెద్దోళ్లతో ఒక సామాన్యుడి పోరాటం ఎలా సాగిందనేది భగవంత్ కేసరి కథ. దర్శకుడు అనిల్ రావిపూడి ప్రధానంగా ఎమోషన్స్, మాస్ ఎలిమెంట్స్ పై దృష్టి పెట్టి సినిమా తెరకెక్కించారని ఆడియన్స్ అభిప్రాయం. సినిమా బాలయ్య-శ్రీలీల మధ్య ఎమోషనల్ సన్నివేశాలతో మొదలవుతుంది. ఇవి డీసెంట్ గా ఉన్నాయి.

ఫస్ట్ హాఫ్ లో కామెడీ కూడా ట్రై చేశాడు. కానీ వర్క్ అవుట్ కాలేదు. ఇంటర్వెల్ బ్యాంగ్ వరకు సినిమా పేలవమైన బోరింగ్ సన్నివేశాలతో సాగుతుంది. విరామానికి ముందు వచ్చే ఫైట్, మాస్ ఎపిసోడ్స్ ఫ్యాన్స్ కి ట్రీట్. ఇక సెకండ్ హాఫ్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ తో స్టార్ట్ చేశారు.బాలయ్యను అనిల్ రావిపూడి డిఫరెంట్ గా ప్రజెంట్ చేశాడు. అనిల్ రావిపూడి గత చిత్రాలకు కూడా భగవంత్ కేసరి భిన్నంగా ఉంది.

బాలయ్య మాస్ డైలాగ్స్, యాక్షన్ ఎపిసోడ్స్ సినిమాకు హైలెట్. ఫ్యాన్స్ కి బిగ్ ట్రీట్. అయితే కథలో ఎలాంటి మలుపులు ఉండవు. ఫ్లాట్ నరేషన్ ఇబ్బంది పెడుతుంది. శ్రీలీల పాత్రకు న్యాయం చేసింది. కాజల్ కి స్క్రీన్ స్పేస్ లేదు. కథ రీత్యా ఆమెతో బాలయ్యకు పాటలు కూడా లేవు. థమన్ సాంగ్స్ నిరాశపరిచాయి. బీజీఎమ్ జస్ట్ ఓకే.

మొత్తంగా భగవంత్ కేసరి రొటీన్ కమర్షియల్ ఎంటర్టైనర్. కథ కథనాల్లో ఎలాంటి కొత్తదనం ఉండదు. అయితే బాలయ్య ఫ్యాన్స్ కి ట్రీట్. మిగతా ఆడియన్స్ పండగ రోజుల్లో ఓ సారి ట్రై చేయవచ్చు. అంచనాలు పెట్టుకొని వెళితే నిరాశ తప్పదు. బాలయ్య డైలాగ్స్, ఫైట్స్ ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తారు. అనిల్ రావిపూడి మార్క్ కామెడీ ఆశించే వాళ్లకు నిరాశ తప్పదు.